Sudhaa Madhura Kiranaala Arunodayam

సుధా మధుర కిరణాల అరుణోదయం

కరుణామయుని శరణం అరుణోదయం (2)

తెర మరుగు హృదయాలు వెలుగైనవి

మరణాల చెరసాల మరుగైనది (2)

1. దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)

నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)

ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది

పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)

నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2)

2. లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)

క్షమ హృదయ సహనాలు సహపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)

నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే

నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)

ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2)

Silent Night Holy

1. శుద్ధరాత్రి! సద్ధణంగ
నందఱు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ
బరిశుద్ధుఁడౌ బాలకుఁడా!
దివ్య నిద్ర పొమ్మా
దివ్య నిద్ర పొమ్మా.

2. శుద్ధరాత్రి! సద్దణంగ
దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకుఁ దెలిపెను
ఎందు కిట్టులు పాడెదరు?
క్రీస్తు జన్మించెను.
క్రీస్తు జన్మించెను.

3. శుద్ధరాత్రి! సద్దణంగ
దేవుని కొమరుఁడ!
నీ ముఖంబున బ్రేమ లొల్కు
నేఁడు రక్షణ మాకు వచ్చె
నీవు పుట్టుటచే
నీవు పుట్టుటచే.