జయశీలుడవగు ఓ మా ప్రభువా

“మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము” 2 కొరింథీ Corinthians 2:14

పల్లవి : జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం

1. పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి
కృతజ్ఞతచే హృదయము నిండె స్తుయింతుమో మా ప్రభు
|| జయశీలుడవగు ||

2. నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయెను
ఉదయించెమాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము
|| జయశీలుడవగు ||

3. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును
నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడ నొసగితివి
|| జయశీలుడవగు ||

4. శత్రుని వురిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి
భయభీతిలోన అభయంబు నిచ్చి విడిపించితివి మా ప్రభో
|| జయశీలుడవగు ||

5. యుద్దంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను
అని ప్రభూ నీవు పోరాడితివి మా పక్షమందు నీవే
|| జయశీలుడవగు ||

6. క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతో మము
ఊరేగించుచు మహిమ నొందుచున్న దేవా స్తోత్రములు
|| జయశీలుడవగు ||

7. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచు కొంటివి నీవు
విడువబడిన మమ్ము వివాహితగా జేసె హల్లెలూయా పాడెదము
|| జయశీలుడవగు ||

యేసు ప్రభువే సాతాను బలమును జయించెను

“అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకు” హెబ్రీ Hebrews 2:14-15

పల్లవి : యేసు ప్రభువే సాతాను బలమును జయించెను (1)
అందరము (1) విజయగీతములు పాడెదము (2)

1. దావీదుకు చిగురు నీవై
యూదా గోత్రపు సింహము నీవై
దేవా నీవే గ్రంథము విప్ప
జయమొందితివి నీకే స్తోత్రములు
|| యేసు ||

2. మన శ్రమలలో విజయము నిచ్చున్
తన రాజ్యమునందు మనలను చేర్చున్
ఘన విజయమును మనకై పొందెన్
ఘన విజయము యేసేయని హర్షించెదము
|| యేసు ||

3. మనలనెంతో ప్రేమించెను
తనయులముగ జయము పొందితిమి
సర్వములో విజయమిచ్చిన
సర్వేశ్వరుండా నీకే జయము
|| యేసు ||

4. మన మాయన సంఘముగా
తన రక్తము ద్వారా సమకూర్చెను
సంఘమునకు శిరస్సాయనే
సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము
|| యేసు ||

5. మహోన్నతుడు మహా ఘనుడు
మహిమరాజు మనకు విజయమునిచ్చె
మరణము గెల్చి తిరిగి లేచె
ఆర్భాటముతో మనము హర్షించెదము
|| యేసు ||