యేసు మధుర నామము పాడుడి – ప్రభు

“నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము.” పరమ గీతము Song Of Songs 1:3

పల్లవి : యేసు మధుర నామము పాడుడి – ప్రభు

1. పరమును విడచి – ఇహమున కరిగెను
పాపుల కొరకై – రక్తము కార్చెను
పనరుత్థానుడై – రక్షణ నిచ్చె – పూర్ణముగా – ముగించె
|| యేసు ||

2. దుఃఖము నుండి మము – విడిపించెను
శోకము రోగము లన్నియు – బాపెను
ఆదరించెను నాదు – హృదయ వేదనలలో – అద్భుతమున్ – జరిగించె
|| యేసు ||

3. లోక పాపములను – మోసెను ప్రభువు
లోకము కొరకై గాయము లొందెను
అధర్మ కార్యములకై – నలిగెను ప్రభువు – అర్పించు కొనెను
|| యేసు ||

4. ప్రియులారా రండి – కలిసి పాడెదము
ప్రియుడగు ప్రభువున్ – ఆరాధించెదము
చరణములపై బడి – ఘనపరచెదము – చేరి భయభక్తితో
|| యేసు ||

పరమ పవిత్ర స్వర్గపిత – జై ప్రభు జై ప్రభు – సర్వ సదా

“మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక” 1 పేతురు Peter 1:3

పల్లవి : పరమ పవిత్ర స్వర్గపిత – జై ప్రభు జై ప్రభు – సర్వ సదా
యుగయుగములకు – రక్షకుడా – మమ్ములను రక్షించితివి
జీవుండ ప్రభు పాపుల రక్షకా – జై ప్రభు

1. ప్రేమరూపి నీవే – నన్ను ప్రేమించితివి
శ్రమలను పొందితివి – నీ ప్రేమ మూలమున
|| పరమ ||

2. ప్రాణమిడి సిలువన్ – నన్ను రక్షించితివి
పాపము తీసితివి – నీ కృప ఉన్నతము
|| పరమ ||

3. శత్రు సైతానున్ – ఓడించితివీవు
నీ మరణము వలన – విమోచించితివి
|| పరమ ||

4. శక్తిగలవాడా – చావున్ గెల్చితివి
శక్తితో లేచితివి – తండ్రితో కలిపితివి
|| పరమ ||

5. ప్రేమగల ప్రభువా – మరల వచ్చెదవు
శ్రమలను తొలగించి – నను చేర్చుకొందువు
|| పరమ ||

6. ప్రవాహములోన – ప్రభు నేనుండినను
నిన్ను బట్టి నే – క్షేమముగా నుందున్
|| పరమ ||

7. జై జై యని పాడుడి – యేసునకే మహిమ
జై జై హల్లెలూయా – జై జై హల్లెలూయా
|| పరమ ||