యెహోవాను గానము చేసెదము

“యెహోవాను గానము చేయుడి.” నిర్గమకాండము Exodus 15:21

పల్లవి : యెహోవాను గానము చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయనే – ఆయన మహిమ పాడెదము
ఆయనను వర్ణించెదము – ఆయనే దేవుడు మనకు

1. యుద్ధశూరుడెహోవా – నా బలము నా గానము
నా పితరుల దేవుడు – ఆయన పేరు యెహోవా
|| యెహోవాను ||

2. ఫరోరథముల సేనలను – తన శ్రేష్ఠాధిపతులను
ఎర్ర సముద్రములోన – ముంచివేసె నెహోవా
|| యెహోవాను ||

3. నీ మహిమాతిశయమున – కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు – నేపై లేచువారిని
|| యెహోవాను ||

4. దోపుడు సొమ్ము పంచుకొని – ఆశ తీర్చుకొందును
నా కత్తి దూసెదను – అని శత్రువనుకొనెను
|| యెహోవాను ||

5. వేల్పులలో నీ సముడెవడు – పరిశుద్ధ మహానీయుడా
అద్భుతమైన పూజ్యుడా – నీవంటి వాడెవడు?
|| యెహోవాను ||

6. ఇశ్రాయేలీయులంతా – ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యను – ఆరిన నేలను నడచిరి
|| యెహోవాను ||

సంస్తుతింతుము నిన్నే – సౌలును విడచితివి

“నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము.” 1 సమూయేలు Samuel 16:12

1. సంస్తుతింతుము నిన్నే – సౌలును విడచితివి
దావీదును కోరుకొని – దీవించిన యెహోవా

2. యెష్షయి పుత్రులలో – ఎర్రని వాడతడు
నేత్రాలు చక్కనివి – నేర్పరి మాటలలోన

3. రత్నవర్ణుడు యేసు – మాటలు దయగలవి
గువ్వలవలె వెలయు – కన్నులు గలవాడేసు

4. బెత్లెహేమునందు – ఖ్యాతిగా వాయించి
సొంపగు పాటలు పాడే – సుగుణాల సుందరుడు

5. పరమగీతము పాడే – పావనుడు మన యేసు
నేర్పరి మాటలలోన – నజరేతు నివాసి

6. వీరుడగు యౌవనుడు – శూరుడు యుద్ధమున
తల్లిని మించి యెహోవా – తనతోడై యున్నాడు

7. నేను కోరిన దితడే – వాని అన్నలముందు
అభిషేక తైలముతో – అభిషేకించుము వాని

8. సంఘవరుడగు క్రీస్తు – సత్యముగ మన శిరస్సు
ఆత్మాభిషిక్తుండై – అలరారుచున్నాడు