సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా

“నా ప్రభువా నా దేవా” యోహాను John 20:28

పల్లవి : సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా

అనుపల్లవి : ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు
స్తుతి యిదియే సుందర రక్షకుడా

1. రాజాధిరాజా నీవే – మా – షారోను రోజ నీవే
త్వరగా వత్తుననిన గొప్ప దేవా – నరుల మమ్ము జూడుమా
|| సుందర ||

2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా – యూద – గోత్రమున బుట్టితి
నార్తురాలైన నాయీను విధవ – కుమారుని లేపితివి
|| సుందర ||

3. రత్నవర్ణ వదనుడా – యూద – కన్య మరియ కాత్మజా
మన్నించి పరమున జేర్చువాడా – మమ్ము బ్రేమజూడు మా
|| సుందర ||

4. నాకము పట్టలేని – వాడా – లోకమునకు వచ్చితీ జీవ
ప్రాణమిచ్చి దాహము తీర్చితివి – హీనునిలో నుండుమా
|| సుందర ||

5. మార్గం సత్యం జీవమై – మమ్ము – కున్కక కాపాడుచు – అర
చేతిలో మమ్ము చెక్కియున్నవాడా – మంచిగొల్ల బోయుడా
|| సుందర ||

6. ఆశ్చర్యకరుడ నీవే – మంచి – ఆలోచన కర్తయు
బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు
|| సుందర ||

7. హల్లెలూయా పాడను – మహా – సత్యాత్మ వరమీయను
న్యాయము తీర్చుట కేతెంచువాడా – నిల్వక రారమ్మయా
|| సుందర ||

మంగళమే యేసునకు – మనుజావతారునకు

“దావీదు కుమారునికి జయము” మత్తయి Matthew 21:9

పల్లవి : మంగళమే యేసునకు – మనుజావతారునకు
శృంగార ప్రభువున – కు క్షేమాధిపతికి

1. పరమ పవిత్రునకు – వరదివ్య తేజునకు
నిరుప మానందునకు – నిపుణ వేద్యునకు
|| మంగళమే ||

2. దురిత సంహారునకు – వరసుగుణోదారునకు
కరుణా సంపన్నునకు – జ్ఞానదీప్తునకు
|| మంగళమే ||

3. సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు
నిత్యాస్వయంజీవునకు – నిర్మలాత్మునకు
|| మంగళమే ||

4. యుక్తస్తోత్రార్హునకు – భక్త రక్షామణికి
సత్యపరంజోతియగు – సార్వభౌమునకు
|| మంగళమే ||

5. పరమపురి వాసునకు – నరదైవ రూపునకు
పరమేశ్వర తనయునకు – బ్రణుతింతుము నీకు
|| మంగళమే ||