స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా

“సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.” ప్రకటన Revelation 4:8

1. స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా
పాత్రుల జేసి నేటివరకు మమ్ము కాచినదేవా

2. పొత్తిగుడ్డల చేత చుట్టబడిన తండ్రి
పాపులకై జీవమిడి గొల్లలకు నిజహర్ష మిచ్చితివే

3. హేమకిరీటము తెల్లంగినే నే ధరింప
హీనకిరీటము ముండ్లతో పొందితి – నన్ను రక్షింప

4. పాపినై చేసెడు పాపములను తీర్చను
ఏపుగ కల్వరి యందున నాకై పాట్లుపడితివి

5. పాప నివారణ బలియగు గొఱ్ఱెపిల్ల
పాపమృతులమౌ మమ్మురక్షింప ప్రాణమిచ్చితివే

6. సైతానును జయింప శక్తినిచ్చిన దేవా
బుద్ధితో పోరాడి యుద్ధమున గెల్వ జ్ఞానమీయుము

7. ఈలాటి ప్రేమను ఏలాగు తెల్పుదును
జీవమార్గమున చ్క్కగ నడుతు నాయన శక్తిచే

8. దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి
దానములిమ్ము దయతోడ నిత్యము దయగల మా తండ్రి

స్తుతియించు ప్రియుడా – సదా యేసుని

“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.” కీర్తన Psalm 103:1

పల్లవి : స్తుతియించు ప్రియుడా – సదా యేసుని
ఓ ప్రియుడా – సదా యేసుని

1. నరకము నుండి నను రక్షించి
పరలోకములో చేర్చుకొన్నాడు
|| స్తుతియించు ||

2. ఆనంద జలనిధి నానందించి
కొనియాడు సదా యేసుని
|| స్తుతియించు ||

3. సార్వత్రికాధి కారి యేసు
నా రక్షణకై నిరు పేదయాయె
|| స్తుతియించు ||

4. పాపదండన భయమును బాపి
పరమానందము మనకొసగెను
|| స్తుతియించు ||

5. మన ప్రియయేసు వచ్చుచున్నాడు
మహిమశరీరము మనకొసగును
|| స్తుతియించు ||

స్తోత్రము యేసునాథా నీకు సదా

“నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.” కీర్తన Psalm 34:1

1. స్తోత్రము యేసునాథా నీకు సదా – స్తోత్రము యేసునాథా
స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము – పిత్రపుత్రాత్మలకు

2. నేడు నీదు నామమందున – మేము చేరి స్తుతించునట్లు
చేసిన కృపకై నీకే నిరతము – స్తోత్రము చేసెదము

3. నీదు రక్తధారచే కలిగిన – సజీవ నవమార్గము
దాసులము తండ్రి సన్నిధి చేరను – నిత్యము స్వాతంత్ర్యము

4. ఇట్టి ప్రభావమైన పదవిని – పురుగులమగు మాకు
ఇంత దయతోడ నిచ్చిన కృపమా – కెంతయు నాశ్చర్యము

5. దూతల సైన్యములు శృంగార – గీతముల నెప్పుడు
రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు – నార్భటించుచుందురు

6. నీవు తఫ్ఫ మాకు పరమందున – వేరెవరు గలరు?
ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?

దేవాది దేవుని భూజనులారా

“దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.” కీర్తన Psalm 136:2

పల్లవి : దేవాది దేవుని భూజనులారా – రండి స్తుతించ సదా

1. కరుణ కృపా ప్రేమ – మయుడైన దేవుడు
వరుసగ మనకన్ని – దయ చేయువాడు
|| దేవాది ||

2. వదలక అడుగుది – ఈయంబడు ననెన్
వెదకుడి తట్టుడి – తీయంబడు ననెన్
|| దేవాది ||

3. యేసుని పేరట – వేడిన దానిని
దాసుల కిడును – దేవుడు వేగమే
|| దేవాది ||

4. సుతుని ఇచ్చినవాడు – కొరత గానీయడు
ప్రేతిగా సమస్తము – నిచ్చును దయతో
|| దేవాది ||

5. సత్యమునందు – మనల నడిపించను
నిత్యాత్మను శాశ్వతముగా నెచ్చెను
|| దేవాది ||

6. ప్రాకటముగా నల్లెలూయ పాడుటకు
సకల మానవులు నిరతము స్తుతింపను
|| దేవాది ||

దావీదు వంశ యేసు క్రీస్తుకు – స్తుతి చెల్లించుడి

“ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము” మత్తయి Matthew 21:9

1. దావీదు వంశ యేసు క్రీస్తుకు – స్తుతి చెల్లించుడి
స్వర్గస్తులమగుటకు మనలను విడిపించిన ప్రభువునకు
హోసన్నా హోసన్నా – భువిలో సంతొషం

2. మానుజావతారమున భువికి వచ్చి
తన స్వంత జీవమును బలిగాను యిచ్చి
హోసన్నా యేసుని పేరట పరమును మనకొసగెన్

3. ప్రియ తండ్రీ ఈ భువిలో సకల మహిమయు నీకే
సూర్య చంద్ర సృష్టియావత్తు స్తుతియించి మహిమపరచున్
హోసన్నా హోసన్నా క్రొత్త యెరూషలేములో