వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు

“నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు” ప్రకటన Revelation 4:11

పల్లవి : వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే
నన్నేలెడు ప్రభు నా రాజాయనే
యుగుయుగ మహిమ ప్రభువునకే
పాడుచుండెదను భజియించెదను జయధ్వనుల జేతున్
|| వందనము ||

2. నా ఆదర్శము మహిమయు తానే
తన యధికారము సర్వము నేలును
తన నామము బహు అద్భుతము
|| వందనము ||

3. యెహోవా బహుస్తుతికి యోగ్యుడు
భక్తుల స్మరణ నీతియు నాయనే
మహాప్రభావము గలవాడు
|| వందనము ||

4. బుద్దియు బలము జ్ఞానము ప్రభువే
తన నీతి బహు ఉన్నతమైనది
సైన్యముల కధిపతి నా తోడు
|| వందనము ||

ప్రభువా నీ గొప్పతనము – స్తుతికి యోగ్యము

“యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు.” కీర్తన Psalm 145:3

పల్లవి : ప్రభువా నీ గొప్పతనము – స్తుతికి యోగ్యము
అశక్యమైనది – వర్ణించలేమిల
1. సృష్టి గొప్పది అద్భుతమేగా – సంకల్పమెంతో వుత్తమము
మానవజాతి కొరకై ప్రభూ – సిద్దపరచె సమస్తము
నీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల
|| ప్రభువా ||

2. నీ రూపమున నరుని సృజించి – అధికారము నిచ్చితివి
క్రీస్తునందు నిర్దోషినిగా – నిలువబెట్ట గోరితివి
నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల
|| ప్రభువా ||

3. సృష్టిని చేసిన శక్తికంటె – పాపికి రక్షణ గొప్పది
నీ యొద్ద నున్న సర్వమిచ్చి – విలువగు ముత్యము కొన్నావు
నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల
|| ప్రభువా ||

4. నీకు మానవుడమూల్యము – నీవు ప్రేమించుచున్నావు
అందుకే నీ ప్రాణమర్పించి – రక్తము కార్చి రక్షించితివి
నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల
|| ప్రభువా ||

5. అద్భుతమైన నూతన సృష్టి – మానవునికి నిచ్చితివి
రాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివి
నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల
|| ప్రభువా ||

6. ఉల్లాసముతో సృష్టి మైమరచే – అద్భుత కార్యములను చూచి
సంతోషించి ఆరాధించిరి – నీవే సర్వమని చెప్పిరి
నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల
|| ప్రభువా ||

జై ప్రభు యేసు – జై ఘన దేవా

“విజయమందు మరణము మింగివేయబడెను” 1 కొరింథీయులకు Corinthians 15:54

పల్లవి : జై ప్రభు యేసు – జై ఘన దేవా
జై ప్రభు జై జై రాజా – జై ప్రభు జై జై రాజా
1. పాపకూపములో పడి చెడి యుండగా
గొప్ప రక్షణ నిచ్చి దరి చేర్చిన
|| జై ప్రభు ||

2. విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముని నీవు కడిగితివే
|| జై ప్రభు ||

3. నా శైలమై యేసు నన్నావరింపగా
యే శోధనైన గెల్చునా?
|| జై ప్రభు ||

4. కడు భీకరమగు తుఫానులలో
విడువక జయముగా నడుపుచున్న
|| జై ప్రభు ||

5. పసితనము నుండి ముదిమి వరకు
విసుగక ఎత్తు-కొను రక్షకా
|| జై ప్రభు ||

6. సమృద్ధుడు యేసు సహాయుడాయే
ఓ మృత్యువా! నీ ముల్లెక్కడ?
|| జై ప్రభు ||

7. సమాధి గెలిచిన విజయుడుండగ
సమాధి నీకు జయమగునా?
|| జై ప్రభు ||

ఆనంద మానంద మానందమే

“దేవుని స్తుతించుచు … దేవాలయములోనికి వెళ్ళెను” అపొస్తలుల కార్యములు Acts 3:8

పల్లవి : ఆనంద మానంద మానందమే – ఆనంద మానందమే

1. నా ప్రియ యేసు – గొప్ప రక్షణనివ్వ సిలువలో బలియాయెన్
|| ఆనంద ||

2. నా ప్రియ యేసు – పాప పడకనుండి నన్ను పైకి లేపెను
|| ఆనంద ||

3. నా ప్రియ యేసు – తన రక్తములో ప్రేమతో నను కడిగెను
|| ఆనంద ||

4. నా ప్రియ యేసు – బాప్తిస్మమున నన్నైక్యపరచెను
|| ఆనంద ||

5. నా ప్రియ యేసు – నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను
|| ఆనంద ||

6. నా ప్రియ యేసు – గొప్ప రక్షణను నిర్లక్షించెదనా?
|| ఆనంద ||

7. నా ప్రియ యేసు – స్తుతిపాత్రుండని హల్లెలూయా పాడెదను
|| ఆనంద ||

హృదయ మర్పించెదము ప్రభునకు

“పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి.” రోమీయులకు Romans 12:1

పల్లవి : హృదయ మర్పించెదము ప్రభునకు
స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి

1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్
పాపుల పాపము తొలగించుటకు
నిత్యజీవము నిచ్చెన్
|| హృదయ ||

2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు
నిత్య నిరీక్షణ నిచ్చెన్
|| హృదయ ||

3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
తిరిగి వెళ్ళకు పాపమునకు
నిలువకు పాపములో
|| హృదయ ||

4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
కాపాడు మా జీవితముల
ఇదియే మా వినతి
|| హృదయ ||