పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా

“సైన్యముల కధిపతియగు యెహోవా పరిశుద్ధుడు” యెషయా Isaiah 6:3

1. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింపగలరా

2. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా

3. పరిశుద్ధ తనయుడా నరరూప ధారుడా
నరులను రక్షించు కరుణా సముద్రా

4. పరిశుద్ధమగు నాత్మ వరములిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తుల కిడుమా

5. జనక కుమారాత్మలను నేక దేవా
ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా

నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు

“దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను వినిపించెదను” కీర్తన Psalm 66:16

1. నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు
దయచే ప్రాయశ్చిత్తమైతివి నాదు రోజవు

2. సాతానుకు నే దాసుదనై నాశమొందగా
నాతాను ద్వారా తెలిపితివి నాదు ప్రియుడా

3. వ్యాదిగ్రస్తుండనై హృదయక్షీణ మొందితిన్
బాధల నొంది తప్పియుంటి నాదు ప్రియుడా

4. తప్పిన రూక, పిల్లవాడు, గొఱ్ఱెవలెనే
తప్పిన నన్ను వెదకి రక్షించితివి ప్రియుడా

5.తలిదండ్రులు విడిచినను నీవు విడువవు
చల్లగ ప్రక్కజేర్చి బ్రోతువీవు ప్రియుడా

6. నావాడవైతివి నేను నీదు వాడను
నాయాపదయందున్న ప్రభువు నాదు ప్రియుడా

7. ప్రభావముతో సాక్ష్యమీయ రాజ్యమేలుచు
ఆ భాగ్యమును చూడనిమ్ము నాదు ప్రియుడా

8. రక్షించితివి హల్లెలూయ పాడునట్లుగా
ఈ క్షితిలో నెల్లరకు చాట నాదు ప్రియుడా

కల్వరిలోని శ్రేష్ఠుడా – కరుణా భరిత సింహమా

నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.” 1 కొరింథీయులకు Corinthians 2:2

పల్లవి : కల్వరిలోని శ్రేష్ఠుడా – కరుణా భరిత సింహమా
కన్ను భ్రమించు ప్రభువా – సిలువలోని మిత్రుడా

1. స్తుతుకి పాత్రుండగువాడా – దూతలతో వెంచేయువాడా
సుదతి మరియ పుత్రుడా – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

2. పాపులకై వచ్చినవాడా – ప్రేమ గల్గిన రక్షకుడా
పాదములపై బడితిమి – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

3. దీవెనల నిచ్చుటకై – వసుధ కేతించినవాడా
నీవే సుంకరు లాప్తుడవు – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

4. అయిదు రొట్టెలు మరి రెండు – చేపలతో నైదు వేల
జనుల పోషించిన తండ్రి – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

5. నీళ్ళను రసముగ మార్చితివి – నీళ్ళ మీద నడిచితివి
మేళ్ళ నొసగు మా దాతా – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

6. రోగుల బాగుచేయువాడా – గ్రుడ్డికి నేత్రము లిచ్చితివి
అనాధుల నాయకుడా – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

7. హల్లెలూయా కర్హుడా – యెల్లరు కొనియాడు వాడా
బలముతో వచ్చువాడా – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా

“నీ సంవత్సరములకు అంతము లేదు.” కీర్తన Psalm 102:27

పల్లవి : ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే

1. అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి
|| ఆదియంతము ||

2. ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి
|| ఆదియంతము ||

3. యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి
|| ఆదియంతము ||

4. పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి
|| ఆదియంతము ||

5. దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి
|| ఆదియంతము ||

స్తుతించుడి స్తుతించుడి

“మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి.” కీర్తన Psalm 135:2

పల్లవి : స్తుతించుడి స్తుతించుడి
ఆయన మందిరపు ఆవరణములో
యెహోవా దేవుని స్తుతించుడి
భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి
రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి

1. సర్వాధికారుడంచు – సర్వశక్తి మంతుడంచు
సంపూర్ణ ప్రేమరూపి – సాధుల శ్రీమంతుడంచు
సృష్టి నిన్ స్మరణ చేసెనో – ఓ … స్తుతించుడి
|| స్తుతించుడి ||

2. పెళపెళ మ్రోగెడు ఉరుములలోన – రాజా రాజా
తళతళ మెరిసెడు మెరుపులలోన – రాజా రాజా
చననము గలిగిన జీవులలోన – రాజా రాజా
పలుకులు లేని ప్రకృతిలోన – రాజా రాజా
రాజాధి రాజుల రాజా – ఓ … స్తుతించుడి
|| స్తుతించుడి ||