యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట

1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్
స్వచ్ఛ జలముచెంత – నిచ్చును విశ్రాంతి
ముందు ముందు వెళ్లుచు – పొందుగా రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున – తనివి దీర్చును
|| యేసు ప్రభూ ||

2. మరణపులోయ ద్వారా – సరిగా నడిపించును
అడవి భయములెల్ల – ఎడబాపి రక్షించున్
హత్తి ఒత్తి కట్టి గాయా – లెంతో ఆదరించును
వింతగు ఆయన ప్రేమ సేవలో – సంతోషింతును
|| యేసు ప్రభూ ||

3. శత్రుల ముందాహారం – సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి – పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్ధిచేసి – ఆత్మదానమిచ్చెను
వడిగా ఆయన సాయమున – జయమున వెళ్ళెదను
|| యేసు ప్రభూ ||

యెహోవా నా కాపరి నాకు లేమి లేదు

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్

1. మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్
|| యెహోవా ||

2. పగవారి యెదుట ప్రేమతో నొక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశ మొందెదము
|| యెహోవా ||

3. నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది
|| యెహోవా ||

4. చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసముగా నుందున్
|| యెహోవా ||

నీవే యెహోవా నా కాపరివి

“నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తన Psalm 23

పల్లవి : నీవే యెహోవా నా కాపరివి
నాకేమి కొదువ లేదిలలోన

1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చి
స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి
నా ప్రాణమునకు సేదను దీర్చి
నన్ను నడుపుము నీతిమార్గమున
|| నీవే యెహోవా ||

2. గాఢాంధకార లోయలయందు
పడియుండి నేను సంచరించినను
తోడైయుందువు నీ దుడ్డుకర్ర
దండముతో నీ వాదరించెదవు
|| నీవే యెహోవా ||

3. శత్రువుల యెదుట నీవు నాకు
నిత్యమగు విందు సిద్ధపరచి
నాతల నూనెతో నంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది
|| నీవే యెహోవా ||

4. నిశ్చయముగా కృపాక్షేమములే
వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్
చిరకాలము యెహోవా మందిరమున
స్థిరముగా నే నివసించెదను
|| నీవే యెహోవా ||

యెహోవా నా కాపరి – లేమి కలుగదు

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యెహోవా నా కాపరి – లేమి కలుగదు
పచ్చికలపై పరుండజేయుచున్నాడు

1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల
చెంత నన్నడిపించుచున్నాడు
|| యెహోవా ||

2. సర్వదా నాదు ప్రాణంబునకు
సేద దీర్చుచున్నాడు యెహోవా
|| యెహోవా ||

3. తన నామమును బట్టి నీతి మార్గములో
నన్ను చక్కగా నడుపుచున్నాడు
|| యెహోవా ||

4. చీకటి లోయలో నే తిరిగినను
ఎట్టి అపాయమునకు భయపడను
|| యెహోవా ||

5. నీ దుడ్డుకర్ర నీ దండముతో న
న్నాదరించి తోడై యుందువు
|| యెహోవా ||

6.నా శత్రువుల యెదుట నీవు నాకు
భోజనము సిద్ధపరచుదువు
|| యెహోవా ||

7. నూనెతో నా తల నంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది
|| యెహోవా ||

8. నన్ను వెంటాడు సదా కృప క్షేమము
నిత్యమెహోవా మందిరములో నుండెద
|| యెహోవా ||

యాకోబు దేవుడాపద కాలంబుల యందు

"ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక!" కీర్తన Psalm 20

పల్లవి : యాకోబు దేవుడాపద కాలంబుల యందు
నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక!
1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును
సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును
|| యాకోబు ||

2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు
నీ దహన బలులను అంగీకరించును గాక
|| యాకోబు ||

3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన
యంతటిని సఫలము చేసి నిన్ను గాచును
|| యాకోబు ||

4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుము
మా దేవుని నామమున ధ్యజము నెత్తెదము
|| యాకోబు ||

5. నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచును
యెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక
|| యాకోబు ||

6. రక్షించి దక్షిణ హస్తబలమును చూపును
యుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి
||యాకోబు దేవుడాపద||

7. అతిశయ పడుదురు రథ గుఱ్ఱములతో
యెహోవా నామములో మనము అతిశయింతుము
|| యాకోబు ||

8. వారు కృంగి నేలమీదపడి లేవకున్నారు
మనము లేచి చక్కగా నిలుచుచున్నాము
|| యాకోబు ||



Psalm - 20

Dukhon men sada teri Yahowa sune

Pallavi : Yaakobu devudaapada kaalambula
Yandu ninnudharinchi nee
Kuththaramunitchunu gaaka

1. Parishuddha stalamu nundi neeku
Saaya mitchunu - Siyonu nundi
Yehovaa ninnaadarinchunu “Yaakobu”

2. Nee naivedyamu lanni jnapti nunchu
konuchu nee dahana balulanu
angeekarinchunu gaaka “Yaakobu”

3. Nee korika siddhimpajesi nee
Yaalochana-yanthatini saphalamu
chesi ninnu gaachunu “Yaakobu”

4. Nee rakshananu batti memu
Yutsahintumu maa devuni naamamuna
dhwajamu neththedamu “Yaakobu

5 Nee prardhana lanni Yehovaa
saphala parachunu - yehovaa thana
abhishikhtuni rakshinchunu gaaka “Yaakobu”

6. Rakshinchi dakshina hasta balamunu
choopunu - yuttara mitchunu
parishuddha stalamu nundi “Yaakobu”

7. Atishaya paduduru radha
gurramulatho yehovaa naamamulo
manamu athishayinthumu “Yaakobu”

8. Vaaru krungi nela meeda padi
leva kunnaaru - manamulechi
chakka gaa niluchu chunnaamu “Yaakobu”