యూదాలో దేవుడు ప్రసిద్ధుడు

పల్లవి : యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది అనుపల్లవి : షాలేములో తన గుడారమున్నది సీయోనులో తన ఆలయమున్నది 1. అక్కడ వింటి అగ్ని బాణములను తాను అక్కడి కేడెముల కత్తులను అక్కడ యుద్ధ ఆయుధములను తాను అక్కడి వాటిని విరుగగొట్టెను దుష్ట మృగములను పర్వతముల యందము కన్నను నీవెంతో తేజోమయుడవు || యూదాలో || 2. కఠినహృదయులు దోచుకొనబడి వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు పరాక్రమశాలు లందరిని – వారి బాహు … Read more

క్రీస్తుని నామము నిత్యము నిల్చున్

1. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ సూర్యుడున్నంత కాలము చిగుర్చున్ 2. అతనినిబట్టి మానవులెల్లరు తథ్యముగానే దీవించబడెదరు 3. అన్యజనులందరును అతని ధన్యుడని చెప్పుకొను చుందురు 4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు స్తుతింపబడును గాక 5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములు చేయువాడు గాన స్తోత్రార్హుండు 6. ఆయన మహిమగల నామము నిత్యమును స్తుతింపబడును గాక 7. సర్వభూమి ఆయన మహిమచే నిండియుండును గాక ఆమెన్‌ ఆమెన్‌