సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
నరులకై విలపించు నజరేయుడు
ఆ దేవుడు చిందించిన రుధిర దారలే
ఈ జగతిని విమోచించు జీవధారలు

1.నిరపరాధి మౌనభుని దీనుడాయెను
మాతృమూర్తి వేదననే ఓదార్చెను
అపవాది అహంకార మణచి వేసెను
పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ||

2.కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను
పాప జగతి పునాదులే కదలిపోయెను
లోక మంత చీకటి ఆవరించెను
శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||

సిలువ చెంత చేరిననాడు

పల్లవి:
సిలువ చెంత చేరిననాడు – కలుషములను కడిగివేయు

పౌలు వలెను సీల వలెను – సిద్ధపడిన భక్తుల జూచి
…సిలువ…

1.
కొండవంటి బండవంటి – మొండి హృదయంబు మండించు

పండియున్న పాపులనైన – పిలుచుచుండె పరము చేర
…సిలువ…

2.
వంద గొఱ్ఱెల మంద నుండి – ఒకటి తప్పి ఒంటరియాయె

తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి – ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్
…సిలువ…

3.
తప్పిపొయిన కుమారుండు – తండ్రిని విడచి తరలిపొయె

తప్పు తెలిసి తిరిగిరాగా – తండ్రి యతని చేర్చుకొనెను
…సిలువ…

4.
పాపి రావా పాపము విడచి – పరిశుద్ధు విందులొ చేర

పాపుల గతిని పరికించితివా – పాతాళంబే వారి యంతము
…సిలువ…