నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు

“(సువర్ణ) దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని” ప్రకటన Revelation 1:13

పల్లవి : నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు
1. అల్ఫాయు ఓమేగ వర్తమాన – భూత భవిష్యత్తులో నున్నవాడా
నా సర్వము నిర్వహించువాడా – సర్వాధికారి నిన్నే స్తుతించి
అర్పింతు నీకే నా ఆరాధన
|| నేనే ||

2. ఏడు సువర్ణ దీపస్తంభముల – మధ్య సంచరించుచున్నవాడా
శుద్దీకరించితివి నన్ను – మేలిమిగ మార్చి సంఘమున
చేర్చితివి నిన్నే ఆరాధింతు
|| నేనే ||

3. తెల్లని ఉన్నిని పోలియున్న – వెంట్రుకలు కలిగి యున్నవాడా
ఆలోచనకర్త నీవే నాకు – జ్ఞానమైతివి అసమానుండ
అర్పింతు నీకే నా ఆరాధన
|| నేనే ||

4. సూర్యుని వంటి ముఖము కలిగి – అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి
దృష్టించితివి నా హృదయమున్ – దహించితివి దుష్టత్వము
ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు
|| నేనే ||

5. అపరంజిని పోలిన పాదములు – కలవాడా తీర్పు తీర్చితివి
పాపము లోకములనిల – దుష్ట సాతానున్ సిలువలో గెలిచి
విజయ మిచ్చినందుల కారాధింతున్
|| నేనే ||

6. నీ నోటినుండి బయలువెడలె – రెండంచులు గల వాడి ఖడ్గము
అదియే పాత ఆదామును చంపె – నశింప చేసె నా శత్రుబలమున్
అర్పింతు నీకే నా ఆరాధన
|| నేనే ||

7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన – మొదటివాడా కడపటివాడా
సర్వ సంపూర్ణత నాకిచ్చితివి – అపాయములలో ఆదుకొనుచున్న
ఆమేన్ అనువాడా హల్లెలూయ
|| నేనే ||

హల్లెలూయ పాడుడి – హల్లెలూయ పాడుడి

“ప్రభువును స్తుతించుడి (హల్లెలూయ) రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ….” ప్రకటన Revelation 19:1

పల్లవి : హల్లెలూయ పాడుడి – హల్లెలూయ పాడుడి
హల్లెలూయ పాడుడి – హల్లెలూయ పాడుడి
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ పాడుడి – హల్లెలూయ పాడుడి

1. క్రీస్తు మనకు రక్షణ నొసగెన్ విడిపించె మనల తనదు రక్తముతో
గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ యిదే
అందుకొరకై పాడుడి – హల్లెలూయ పాడుడి
|| హల్లెలూయ ||

2. మహిమ దర్శన మనుగ్రహించె పరమ వైభవమును చూపించె
మహిమ ఘనత స్తుతి ప్రభావములన్నియు ఆయనవే
అందుకొరకై పాడుడి – హల్లెలూయ పాడుడి
|| హల్లెలూయ ||

3. ఘనపరచుడి సజీవ క్రీస్తున్ జీవితములో జూపుడాయనన్
ధనికులుగ మనలను ప్రేమతో తానే జేసెన్
అందుకొరకై పాడుడి – హల్లెలూయ పాడుడి
|| హల్లెలూయ ||

4. నిత్యమగు తన శక్తితో కాయున్ ప్రభు శరణు జొచ్చిన వారిన్
అధిక జయం సాహసమున్ అన్నియు మనవాయెన్
అందుకొరకై పాడుడి – హల్లెలూయ పాడుడి
|| హల్లెలూయ ||

5. ఏమి వచ్చినన్ జీవితయాత్రలో – ఆమెన్ యనుచు సహించెదము
శ్రమలలోనే శాంతి యుండున్ – అద్భుత యానందము
అందుకొరకై పాడుడి – హల్లెలూయ పాడుడి
|| హల్లెలూయ ||

6. దేవునికి భయపడు వారలారా చిన్నలైన మీరు పెద్దలైనను
ఆయనకే యుగములందు స్తుతి చెల్లును గాకని
మీరందరు పాడుడి – హల్లెలూయ పాడుడి
|| హల్లెలూయ ||