ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము

“మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్‌.” ప్రకటన Revelation 1:6

పల్లవి : ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము
స్మరించుచు స్తుతింతున్ – రక్షణ నిచ్చినావు
1. అద్భుత యాగమందు – అందరికై బలియై
అందరి పాపములకు – ప్రాయశ్చిత్తమైతివి
|| ఓ ప్రేమగల ||

2. దాసులమై మేముండ – మోషేను పంపితివి
చేసితివి స్వతంత్రులుగా – నీ బాహుబలము తోడ
|| ఓ ప్రేమగల ||

3. క్షమాపణానందముతో – సాగింపచేసి మమ్ము
యాత్రలో మాకు తోడై – విజయము నిచ్చితివి
|| ఓ ప్రేమగల ||

4. ఎడారి అడవిలోన – ఊటల నదులు నడిపి
ఎండిన నేలనంత – పచ్చిక బయలు చేసెన్
|| ఓ ప్రేమగల ||

5. బాబెలు నుండి మమ్ము – విడిపించితివి నీవు
బంధకముల తెంచి – తప్పు బోధ బాపినావు
|| ఓ ప్రేమగల ||

6. సహవాసమిచ్చి సంఘ – అంగముల జేసినావు
సాక్షులను చేసి మమ్ము – శత్రువుల సిగ్గుపరచె
|| ఓ ప్రేమగల ||

7. మహా ప్రేమ గల యేసు – మాకై చేసితివన్ని
ఘనపరతు హల్లెలూయ – ఈ గొప్ప రక్షణ కొరకు
|| ఓ ప్రేమగల ||

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

“తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.” యోహాను John 15:13

పల్లవి : ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది

1. అగమ్య ఆనందమే – హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు
|| ఓ యేసు ||

2. సంకట సమయములో – సాగలేకున్నాము
దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొరకు ముందే తోడనుందు నంటివి
|| ఓ యేసు ||

3. మరణాంధ కారంపు లోయ నే సంచరించిన
నిరంతరమేసు నాదు కాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు
|| ఓ యేసు ||

4. కొదువ లెన్నియున్న భయపడను నే నెపుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తిపరచుచు – నాతో నుండు నేసు
|| ఓ యేసు ||

5. దేవుని గృహములో సదా స్తుతించెదను
నంపూర్ణ హృదయముతో సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్
|| ఓ యేసు ||