యేసునాథా త్రిలోకనాథా

“నిత్యము ఆయన కోర్తి నా నోట నుండును” కీర్తన Psalm 34:1

1. యేసునాథా త్రిలోకనాథా – లోకోద్ధారక క్రీస్తు దేవా
చక్కగ దాసుల బ్రోచి రక్షించుము

2. అబ్దిమీద నడచిన దేవా – ఐదు రొట్టెల నైదువేలకు
నతిశయముగను పంచిన దేవా

3. కానా లోని వివాహ విందున – నీళ్ళను ద్రాక్షరసముగ మార్చిన
కరుణానిథీ నను ప్రేమించు నిత్యము

4. నాథా నాదు గతియు నీవే – పాదారవింద శరణమిమ్ము
ఆధారమీవే దీనోపకారా

5. కృపాసముద్ర దయామయుండా – తలను ముండ్ల మకుటధారివై
సిలువయందు మరణించితివి

6. నీదు రాజ్యము వచ్చునుగాక – సాధుగ మోక్షసౌఖ్యము చేర
నీదు దాసుల నాశీర్వదించుము

యెహోవాకు పాడుడి పాటన్

“యెహోవాను గూర్చి కీర్తన పాడుడి” యెషయా Isaiah 12:5

పల్లవి : యెహోవాకు పాడుడి పాటన్
అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని
1. భూమియందంతట ప్రచురము చేయుడి
ఆటంకము లేక దీని ప్రకటించుడి
|| యెహోవాకు ||

2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు
అతి ఘనుండై నీ మధ్య – వసియించు చున్నాడు
|| యెహోవాకు ||

3. యెహొవా మన నీతి ఋజువు చేసెనని
సీయోనులో క్రియలను వివరించెదము రండి
|| యెహోవాకు ||

4. శూన్య పట్టణములు నిండినందువలన
యెహోవా నేనేయని వారు గ్రహించెదరు
|| యెహోవాకు ||

5. యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె
నింపెద మనుజులతో వారి పట్టణములను
|| యెహోవాకు ||

6. మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు
నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు
|| యెహోవాకు ||