జై జై జై జై రాజుల రాజా

“ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.” 2 కొరింథీయులకు Corinthians 8:9

పల్లవి : జై జై జై జై రాజుల రాజా
పాత్రుడ వీవే మా ప్రభు వీవే

1. అన్ని కాలములలో నీ నామము
మహోన్నతము మహోన్నతుడా
వాగ్దానము నెరవేర్చిన దేవా
మాట తప్పని మహోపకారి
|| జై జై జై జై ||

2. దూతల మాదిరి గీతముల్ పాడుచు
సతతము నిన్నే స్తోత్రించెదము
గొల్లలు గాంచిన ఘన కాపరి మా
ఉల్లము నందు ఉల్లసించెదము
|| జై జై జై జై ||

3. తూర్పున తారను గాంచిన జ్ఞానులు
రాజుల రాజ నీవే యనుచు
బంగారము సాంబ్రాణి బోళమును
అర్పించి ఆరాధించిరిగా
|| జై జై జై జై ||

4. ధనవంతుడవగు ఓ మా ప్రభువా
ధనహీనునిగా నైతివి మాకై
మా దారిద్ర్యము తీసివేయ
నరరూపమున జన్మించితివి
|| జై జై జై జై ||

5. యేసు ప్రభుండా రక్తము కార్చి
ఎంచి మమ్ము విమోచించితివి
ఎంచలేను నీ మేలుల నెపుడు
ఎన్నదగిన మా దేవుడ నీవే
|| జై జై జై జై ||

6. మాకై సిలువలో మరణించితివి
మరణపు ముల్లును విరచిన ప్రభువా
యుగయుగములకు నీకే మహిమ
నిరతము స్తోత్రము హల్లెలూయ
|| జై జై జై జై ||

పరిశుద్ధ ప్రభు యేసు – స్తుతి స్తోత్రం

“నా ప్రభువా నా దేవా” యోహాను John 20:28

పల్లవి : పరిశుద్ధ ప్రభు యేసు – స్తుతి స్తోత్రం
నన్ను రక్షించినట్టి – నా ప్రభువా

1. గొప్ప దేవుడవని – నే నెరిగితిని
తప్పకుండ నీ నామము – స్మరియింతును
|| పరిశుద్ధ ||

2. తండ్రివైతివి నీవు – పరమునందు
దండి ప్రియుడవు నీవు – నా రక్షకా
|| పరిశుద్ధ ||

3. బహు విశ్వాస హీనుడ – నగు నాకు
మహా ప్రభువై నన్నున్ – మోసెదవా!
|| పరిశుద్ధ ||

4. సజీవుడవైన – విమోచకుడా
ఉజ్జీవము నొసగి – లేపితివే
|| పరిశుద్ధ ||

5. మంచి కాపరి నీవే – మా యేసు ప్రభూ
కొంచెమైనను కొదువ – లేదికను
|| పరిశుద్ధ ||

6. పరలోక ప్రధాన – యాజకుడా
ఏ రీతిగా నిను నే పూజింతును?
|| పరిశుద్ధ ||

7. పరలోకములో నుండి – వరుడేసు
అరుదెంచు నాకై – హల్లెలూయ
|| పరిశుద్ధ ||