యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి

“యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి.” కీర్తన Psalm 149

పల్లవి : యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి
యెహోవాను స్తుతించుడి

అనుపల్లవి : భక్తులు కూడుకొను సమాజములో
స్తోత్రగీతము పాడుడి

1. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను
బట్టి సంతోషించెదరు గాక
సీయోను జనులు తమ రాజును బట్టి
ఆనందించుచు నుందురు గాక
|| యెహోవాకు ||

2. నాట్యముతో వారు తన నామమును
శ్రేష్ఠముగా స్తుతింతురు గాక
తంబురతోను సితారాతోను
తనివి తీర పాడుదురు గాక
|| యెహోవాకు ||

3. యెహోవా ఆయన ప్రజల యందు
మహా ప్రేమ కలిగినవాడు
ఆయన బీదలను రక్షణతో
అందముగ అలంకరించును
|| యెహోవాకు ||

4. భక్తులందరును ఘనతనొంది
నిత్యము ప్రహర్షింతురు గాక
సంతోషభరితులై పడకల మీద
వింత గానము చేతురు గాక
|| యెహోవాకు ||

యెహోవాకు స్తుతులు పాడండి

“యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహగానము చేయుదురు గాక.” కీర్తన Psalm 149

పల్లవి : యెహోవాకు స్తుతులు పాడండి – మీరు
సమాజములో ప్రభు ప్రశంస పాడి
సభలో పాడండి మీరు యెహోవాకు

1. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
సీయోను వాసులు తమ రాజును
స్మరియించుకొని సంతోషింతురు
నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు
|| యెహోవాకు ||

2. తంబురతోను సితారాతోను
తనను గూర్చి గానము చేసి
దేవుని ప్రేమరసమును గ్రోలి
పావనాలంకారమును బొంది – మీరు
|| యెహోవాకు ||

3. భక్తులు ఘనులై హర్షింతురు
ఉత్సాహమున ఉప్పొంగెదరు
పడకల మీద ప్రభువును కోరి
పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు
|| యెహోవాకు ||

4. అన్యజనులను శిక్షించుటకు
రాజులఁ గొలుసుతో బంధించుటకు
రెండంచుల ఖడ్గమును ధరించిరి
దైవ భక్తులకు ఘనతయునిదే – మీరు
|| యెహోవాకు ||

స్తుతించుడి యెహోవా దేవుని

“యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాని నతిక్రమింపదు.” కీర్తన Psalm 148

పల్లవి : స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి

1.కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
|| స్తుతించుడి ||

2. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
|| స్తుతించుడి ||

స్తుతియించుడాయన నాకాశవాసులారా

“యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతియించుదురు గాక! ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.” కీర్తన Psalm 148

1.స్తుతియించుడాయన నాకాశవాసులారా
స్తుతియించుడి ఉన్నతస్థలములలో

పల్లవి : స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి

2. స్తుతియించుడి దూతలారా మీరందరు
స్తుతియించుడాయనన్ సైన్యములారా
|| స్తుతియించుడి ||

3. స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరు
కాంతిగల నక్షత్రములారా
|| స్తుతియించుడి ||

4. స్తుతియించుడి పరమాకాశములారా
స్తుతియించుడి ఆకాశ జలములారా
|| స్తుతియించుడి ||

5. స్తుతియించుడి సమస్త మకరములారా
స్తుతియించుడి అగాధ జలములారా
|| స్తుతియించుడి ||

6. స్తుతియించుడగ్నియు వడగండ్లార
స్తుతియించుడాయన నావిరి హిమమా
|| స్తుతియించుడి ||

7. స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫాను
స్తుతియించుడి పర్వతములు గుట్టలారా
|| స్తుతియించుడి ||

8. స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారా
స్తుతియించుడి దేవదారు వృక్షములారా
|| స్తుతియించుడి ||

9. స్తుతియించుడి మీరు కౄర మృగములారా
స్తుతియించుడి మీరు సాధు జంతువులారా
|| స్తుతియించుడి ||

10. స్తుతియించుడి నేల ప్రాకు జీవులారా
స్తుతియించుడి మీ రాకాశ పక్షులారా
|| స్తుతియించుడి ||

11. స్తుతియించుడాయనన్ భూరాజులారా
స్తుతియించుడి సమస్త జనంబులారా
|| స్తుతియించుడి ||

దేవునికి స్తోత్రము గానము

“తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.” కీర్తన Psalm 147

పల్లవి : దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

1.యెరూషలేము నెహోవాయే – కట్టుచున్న వాడని
ఇశ్రాయేలీయులను – పోగుచేయువాడని
|| దేవునికి ||

2.గుండె చెదరిన వారిని – బాగుచేయు వాడని
వారి గాయములన్నియు – కట్టుచున్న వాడని
|| దేవునికి ||

3.నక్షత్రముల సంఖ్యను – ఆయన నియమించెను
వాటికన్నియు పేరులు – పెట్టుచున్న వాడని
|| దేవునికి ||

4.ప్రభువు గొప్పవాడును – అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే – మితియు లేనివాడని
|| దేవునికి ||

5.దీనులకు అండాయనే – భక్తిహీనుల గూల్చును
సితారతో దేవుని – స్తుతులతో కీర్తించుడి
|| దేవునికి ||

6.ఆయన ఆకాశము – మేఘములతో కప్పుచు
భూమి కొరకు వర్షము – సిద్ధపరచు వాడని
|| దేవునికి ||

7.పర్వతములలో గడ్డిని – పశువులకు మొలిపుంచును
అరచుపిల్ల కాకులకును – ఆహారము తానీయును
|| దేవునికి ||

8.గుర్రముల నరులందరి – బలము నానందించడు
కృపకు వేడువారిలో – సంతసించు వాడని
|| దేవునికి ||

9.యెరూషలేమా యెహోవాను – సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము – ఆనందించు వాడని
|| దేవునికి ||

10.పిల్లల నాశీర్వదించియు – బలపరచె నీ గుమ్మముల్
మంచి గోధుమ పంటతో – నిన్ను తృప్తిగ నుంచును
|| దేవునికి ||

11.భూమికి తన యాజ్ఞను – యిచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని – వాక్యము పరుగెత్తును
|| దేవునికి ||

12.వాక్యమును యాకోబుకు – తెలియజేసిన వాడని
ఏ జనము కీలాగున – చేసియుండ లేదని
|| దేవునికి ||