Rajula rajuga Yesu prabhundu

Rajula rajuga Yesu prabhundu
rayamuna ranai yunnadu

1. Rakshanaalankaaramutho – thakshaname siddapadudi
akshayudagu na rakshakuni – nireekshanatho vedandi “Raju”

2. Mana prabhu yesuni raktamu – mana paapamulanu pogtti
mana prabhu raakada manakentho –
mahimaanandamu kalginchun “Raju”

3. Modata gorepilla vale – nodigi vachenu mana prabhuvu
kodamasimhamuga vachunu – gunde digulu papiki“Raju”

4. Gurutulanniyu jaruguchunda – sariga chudumu viswasi
twarapadumu nee prabhuni jooda -karamulethi prardinchu “Raju”

5. Yellaru kristuni raakanu – ullasamutho koruchu
halleluya paatalu padi – yellappudu stutinchedamu “Raju”

రాజుల రాజుగ యేసు ప్రభుండు
రయమున రానై యున్నాడు

1. రక్షణాలంకారముతో – తక్షణమే సిద్ధపడుడి
అక్షయుడగు నా రక్షకుని – నిరీక్షణతో వేడండి
|| రాజుల ||

2. మన ప్రభు యేసుని రక్తము – మన పాపములను పోగొట్టి
మన ప్రభురాకడ మనకెంతో – మహిమానందము కలిగించున్
|| రాజుల ||

3. మొదట గొఱ్ఱెపిల్ల వలె – నొదిగి వచ్చెను మన ప్రభువు
కొదమసింహముగా వచ్చును – గుండెదిగులు పాపికి
|| రాజుల ||

4. గురుతులన్నియు జరుగుచుండ – సరిగా చూడుము విశ్వాసి
త్వరపడుము నీ ప్రభుని జూడ – కరములెత్తి ప్రార్థించు
|| రాజుల ||

5. ఎల్లరు క్రీస్తుని రాకను – ఉల్లాసముతో కోరుచు
హల్లెలూయా పాటలు పాడి – ఎల్లప్పుడు స్తుతియించెదము
|| రాజుల ||

Yesu raagaane sangamu

Yesu raagaane sangamu-marpu cheyabadi paikettabadunu

1. Melkonunu kristunandu mrutulu –
kadaboora mrogagane – o priyulaaraa
kada boora mrogagane – sri Yesu raagaane “Yesu”

2. Kudivaipuna gorrela jerchun – mekala –
nedama prakka jerchun – o priyulaaraa
nedama prakka jerchun – sri Yesu teerpulo “Yesu”

3. Thanavaari natyadikamugaa preminchi
thanakerparachukonunu o – priyulaaraa –
thanakerparachukonunu – Sri Yesu raagaane “Yesu”

4. Meghamupai mahima -prabhavamutho –
vachunu sri Yesu – o priyulaaraa
vachunu sri Yesu – sri Yesu dutalatho “Yesu”

యేసు రాగానే సంఘము – మార్పు చేయబడి పైకెత్తబడును

1. మేల్కొనును క్రీస్తునందు మృతులు
కడబూర మ్రోగగనె – ఓ ప్రియులారా
కడబూర మ్రోగగనె – శ్రీ యేసు రాగానే
|| యేసు ||

2. కుడివైపున గొర్రెల జేర్చున్ – మేకల
నెడమ ప్రక్క జేర్చున్ – ఓ ప్రియులారా
నెడమ ప్రక్క జేర్చున్ – శ్రీ యేసు తీర్పులో
|| యేసు ||

3. తనవారి నత్యధికముగా ప్రేమించి
తన కేర్పరచుకొనును – ఓ ప్రియులారా
తన కేర్పరచుకొనును – శ్రీయేసురాగానే
|| యేసు ||

4. మేఘముపై మహిమా ప్రభావముతో
బచ్చును శ్రీయేసు – ఓ ప్రియులారా
వచ్చును శ్రీ యేసు – శ్రీ యేసు దూతలతో
|| యేసు ||