నా కోసమా ఈ సిలువ యాగము

నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2)
కల్వరిలో శ్రమలు నా కోసమా
కల్వరిలో సిలువ నా కోసమా (2) || నా కోసమా ||

నా చేతులు చేసిన పాపానికై
నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2)
నీ చేతులలో… నీ పాదాలలో…
నీ చేతులలో నీ పాదాలలో
మేకులు గుచ్చినారే (2)
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా ||

నా మనస్సులో చెడు తలంపులకై
నా హృదిలో చేసిన అవిధేయతకై (2)
నీ శిరస్సుపై… నీ శరీరముపై…
నీ శిరస్సుపై నీ శరీరముపై
ముళ్ళను గుచ్చినారే (2)
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా ||

కలువరి సిలువ సిలువలో విలువ

కలువరి సిలువ సిలువలో విలువ
నాకు తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి
నన్ను వెదికెనుగా (2)
అజేయుడా విజేయుడా
సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి||

కష్టాలలోన నష్టాలలోన
నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన
కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||

పాపానికైనా శాపానికైనా
రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా
మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||