Boora shabhdambu

Boora shabhdambu ningin dwanimpa gaanchedamesun
maa eduta orputho memu vechi yuntimi
nidrinche vaaru nilathurilan

Pallavi : Praana priyudaa – praana priyudaa
rammu maa Yesu – paadedamu – Halleluya –
entho santosham yegiripoyedam – paatalatho

2. Bhaktulakai vachchu thaskarivale – shuddulu maatrame
maaredaru dootalu ningin ekamai koodi paatatho
boora dwaninthuru

3. Vekuva chukka kaantiniboli – soundharyamaina
maadhuryudu paralokamandu hetchainavaadu –
naa korakai shrama sahinchenu

4. Reppapaatutho shuddhulu lechi marugai podu –
raayanatho nundan madhura gumpu meghamu cheri –
sandhincheda mesunatchchata

5. Paramandu shuddhul makutamul bonda dootalu
kaachi nilchu dinam sangha vadhuvu dhavala
vastrambu dharinchi ghanatha nonde dinam

6. Halleluyaa – aanandinchedam Halleluyaa –
aarbhatinthum Halleluyaa – dhanyulaithimi –
Halleluyaa – aamen aamen

“ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.” 1 థెస్స Thessalonians 4:17

బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట
ఓర్పుతో మేము వేచియుంటిమి నిద్రించే వారు నిలతురిలన్

పల్లవి : ప్రాణప్రియుడా – ప్రాణప్రియుడా
రమ్ము మా యేసు – పాడెదము – హల్లెలూయ – ఎంతో సంతోషం
ఎగిరి పోయెదం – పాటలతో

1. భక్తులకై వచ్చు తస్కరివలె – శుద్ధులు మాత్రమే మారెదరు
దూతలు నింగిన్ ఏకమైకూడి – పాటతో బూర ధ్వనింతురు
|| ప్రాణప్రియుడా ||

2. వేకువ చుక్క కాంతినిబోలి – సౌందర్యమైన మాధుర్యుడు
పరలోకమందు హెచ్చయినవాడు – నాకొరకై శ్రమ సహించెను
|| ప్రాణప్రియుడా ||

3. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్
మధుర గుంపు మేఘము చేరి – సంధించెద మే – సునచ్చట
|| ప్రాణప్రియుడా ||

4.పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద
దూతలు కాచి నిల్చుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబు
ధరించి ఘనతనొందే దినం
|| ప్రాణప్రియుడా ||

5. హల్లెలూయా – ఆనందించెదం హల్లెలూయా – ఆర్భటింతుం
హల్లెలూయా – ధన్యులైతిమి – హల్లెలూయా – ఆమెన్ ఆమెన్
|| ప్రాణప్రియుడా ||

Rakshana sampurthicheyutakai

Rakshana sampurthicheyutakai – akshayudesu vachunu
rakshana pondina varellaru – takshname ettabadedaru

2. Parisuddulandu mahima nonda – parama Yesu vachunu
parisuddulu vintapadunatlu – arayunesu vegame

3. Marugainavi bayalu paracha – varudu Yesu vachunu
Hrudaya alochanalella – sadayudu bayaluparachunu

4. Veyendla paalana cheyutakai – rayamuga Yesu vachenu
sarvaraajyamulu anniyu – sarvesudesuni rajyamagun

క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి

అనుపల్లవి : సూచనలు చూపుచున్నవి – వేచియుండుడి ఆయనకై

1. రక్షణ సంపూర్తిచేయుటకై – అక్షయుడేసు వచ్చును
అక్షణ పొందిన వారెల్లరు – తక్షణమే ఎత్తబడెదరు
|| క్రీస్తు ||

2. పరిశుద్ధులందు మహిమ నొంద – పరమ యేసు వచ్చును
పరిశుద్ధులు వింతపడునట్లు – అరయునేసు వేగమే
|| క్రీస్తు ||

3. మరుగైనవి బయలు పరచ – వరుడు యేసు వచ్చును
హృదయ ఆలోచనలెల్ల – సదయుడు బయలుపరచును
|| క్రీస్తు ||

4. వేయేండ్ల పాలన చేయుటకై – రయముగ యేసు వచ్చును
సర్వరాజ్యములు అన్నియు – సర్వేశుడేసుని రాజ్యమగున్
|| క్రీస్తు ||