Devaa naa devaa nannela vidachitivani

Devaa naa devaa nannela vidachitivani
siluvalo baliyaina naa yesuvaa
palu bhadhalonditivi naa sailamaa

1. naa thandri neekidi saadhyamaite
ee ginne naanundi tolagimpumani
naa naadhaa thandrini vedithivaa ne moyaleni ee baramantha
neevu gaka yevaru bharinturu “Devaa”

2. Nee sisyulanthaa yemaipoyiri – neevu swastha parachina roguleri
nee thandrikudaa ninu vidanaadenaa
na doshamantha neepai mopenaa
ninu nalugagottuta kappaginchenaa “Devaa”

3. Ninnu rachcha keedchanu naa rakshakaa –
nee neramemiti o naa prabhuvaa
manavulu devuni champutayaa ?
ye charithambulonu kaladaa prabhoo ?
Ee ghoramaranamu naakai nonditivaa ? “Devaa”

4. Sogasaina shaaronu oh pushpamaa
suroopamanthaa kolpoyithivaa
vyasanaa krantudavaithivaa naakai –
vyadhini anubavinchitivi naakai
vadhimpa baditivi bhali pasuvugaa “Devaa”

దేవా నాదేవా నన్నేల విడచితివని
సిలువలో బలియైన నా యేసువా
పలుబాధ లొందితివి నా శైలమా
1. నా తండ్రి నీకిది సాధ్యమైతే
ఈ గిన్నె నానుండి తొలగింపుమని
నా నాథా తండ్రిని వేడితివా
నే మోయలేని ఈ భారమంత
నీవు గాక యెవరు భరింతురు
|| దేవా ||

2. నీ శిష్యులంతా యేమైపోయిరి
నీవు స్వస్థపరచిన రోగులేరి
నీ తండ్రికూడా నిను విడనాడెనా
నా దోషమంతా నీపై మోపెనా
నిను నలుగగొట్టుట కప్పగించెనా
|| దేవా ||

3. నిన్ను రచ్చకీడ్చను నా రక్షకా
నీ నేరమేమిటి ఓ నా ప్రభువా
మానవులు దేవుని చంపుటయా?
ఏ చరితంబులోనూ కలదా ప్రభూ?
ఈ ఘోరమరణము నాకై నొందితివా?
|| దేవా ||

4. సొగసైన షారోను ఓ పుష్పమా
సురూపమంతా కోల్పోయితివా
వ్యసనా క్రాంతుడవైతివా నా కై
వ్యాధిని అనుభవించితివి నాకై
వధియింప బడితివి బలి పశువుగా
|| దేవా ||

Calvari guttameedanu

Calvari guttameedanu – durmargavairulu
dweshinchi silva medanu – sri Yesunjampiri

2. Sri Yesu shramalanniyu – ne nenchajalanu
nannun rakshinchulaguna – pranambu bettenu

3. Ne jeeva mondulaaguna – chavunu pondenu
nannun rakshimpa shramanu – sri Yesu pondenu

4. Sri Yesu gaka guruvu – lerinka naakunu
naa vanti paapulellarin – rakshimpa vachchenu

5. Naa Yesu prema goppadi – yamoolyamainadi
nepremathonu Yesunu – sevinthu nithyamu

కల్వరి గుట్టమీదను – దుర్మార్గవైరులు
ద్వేషించి సిల్వ మీదను – శ్రీ యేసుజంపిరి

2. శ్రీయేసు శ్రమలన్నియు – నే నెంచజాలను
నన్నున్ రక్షించులాగున – ప్రాణంబు బెట్టెను

3. నే జీవ మొందులాగున – చావును పొందెను
నన్నున్ రక్షింప శ్రమను – శ్రీ యేసు పొందెను

4. శ్రీ యేసు గాక గురువు – లేరింక నాకును
నా వంటి పాపులెల్లరిన్ – రక్షింప వచ్చెను

5. నా యేసు ప్రేమగొప్పది – యమూల్యమైనది
నే ప్రేమతోను యేసును – సేవింతు నిత్యము