Yesu prabhu naa korakai

Yesu prabhu naa korakai – baliganu neevaitivi “2”

1. Siluvalona yesu – needu pranamichitivi ….. 2
pranamichitivi – pranamichitivi …….. 2 “Yesu”

2. Siluvarakhtamutoda – nannu jerchukontivi
cherchukontivi – cherchukontivi “Yesu”

3. Nee velugunu neevu – naalo veliginchitivi
veliginchitivi – veliginchitivi “Yesu”

4. Nee premanu neevu – naalo nimpitiviga
nimpitiviga – nimpitiviga “Yesu”

5. Naa papamu nantatini – naa nundi teesitivi
teesitivi – teesitivi “Yesu”

6. Nithyamu ne ninnu – sthutiyinchi keertintunu
keertintunu – keertintunu “Yesu”

యేసు ప్రభూ నా కొరకై – బలిగాను నీవైతివి (2)

1. సిలువలోన యేసు – నీదు ప్రాణమిచ్చితివి (2)
ప్రాణమిచ్చితివి – ప్రాణమిచ్చితివి (2)
|| యేసు ప్రభూ ||

2. సిలువ రక్తము తోడ – నన్ను జేర్చుకొంటివి
చేర్చుకొంటివి – చేర్చుకొంటివి
|| యేసు ప్రభూ ||

3. నీ వెలుగును నీవు – నాలో వెలిగించితివి
వెలిగించితివి – వెలిగించితివి
|| యేసు ప్రభూ ||

4. నీ ప్రేమను నీవు – నాలో నింపితివిగా
నింపితివిగా – నింపితివిగా
|| యేసు ప్రభూ ||

5. నా పాపము నంతటిని – నా నుండి తీసితివి
తీసితివి – తీసితివి
|| యేసు ప్రభూ ||

6. నిత్యము నే నిన్ను – స్తుతియించి కీర్తింతును
కీర్తింతును – కీర్తింతును
|| యేసు ప్రభూ ||

 

Manakai yesu maraninche

Manakai yesu maraninche mana papamula
korakai – nitya jeevamu nitchutake satyundu
sajeevudaaye

1. Thruneekarimpabade – visarjimpa badenu – dukha –
krantudaye vyasanamula bharinchenu “Mana”

2. Mana vyasanamula vahinchen mana dukkhamula
bharinchen – mana mennika cheyakaye – mana mukhamula
drippitimi “Mana”

3. Mana yatikramamula koraku – mana doshamula koraku
mana naadhudu siksha nonde – manaku swastata kalige
“Mana”

4. Gorrela vale thappitimi – parugidifmi mana daarin
arudenche kaapariyai – arpinchi praanamunu “Mana”

5. Dourjanyamu nondenu – baadimpa badenu – thana noru
theruvaledu – manakai krayadhana meeyan “Mana”

6. Edirimpaledevarin – lede kapatamu nota – Yehovaa
naluga gotten – mahaa vyaadhinikaliginchen “Mana”

7. Siluvalo vrelaaden – samaadhilo nundenu
sajeevundai lechen – stotramu halleluya “Mana”

మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె

1. తృణీకరింపబడె విసర్జింపబడెను
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను
|| మనకై యేసు ||

2. మన వ్యసనముల వహించెన్ – మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే – మన ముఖముల ద్రిప్పితిమి
|| మనకై యేసు ||

3. మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె
|| మనకై యేసు ||

4. గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్
అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును
|| మనకై యేసు ||

5. దౌర్జన్యము నొందెను – బాధింపబడెను
తననోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్
|| మనకై యేసు ||

6. ఎదిరింప లేదెవరిన్ – లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్ – మహావ్యాధిని కలిగించెన్
|| మనకై యేసు ||

7. సిలువలో వ్రేలాడెన్ – సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్ – స్తోత్రము హల్లెలూయ
|| మనకై యేసు ||