Betlehem puramuna

Betlehem puramuna – chitrambu kalige
karthaadi yesu – janminchinapudu
andhakarampu – prudhivi veedulalo
modampu mahima – chodyambuganare

1. Vudyampu taral – mudamuna baade
vudayincha yesu – Ee prudhivilona
mudamunu galige – mari samadhanam
padilambuthoda – poojincha randi “Betlehem”

2. Paramunu vidachi – nara roopametti
arudenche yesu – parama vaidyundai
narula dhukhamulan – tolaginchivesi
paraloka shanthi – sthiraparchi prabhuvu “Betlehem”

3. Needu chittamunu – naadu hrudayamuna
mudamuna jeya – madinentho yaasha
needu paalanamu – paramandu valene
Ee dharaniyandu – jaruganga jooda “Betlehem”

4. Devuni sannidhi – deenatha nunda
pavanayathma – pavithra parachun –
pavanudesu prakasha michichi
jeevambu nosagi – Jeevinchu Nedalo “Betlehem”

5. Gathinche raathri – prakashinche kaanthi –
vithaanamuga vikasinche nella
dootala dhwanito – pathi yesu christhu
athi prema thoda – arudenche noho “Betlehem”

బేత్లెహేం పురమున – చిత్రంబు కలిగె
కర్తాది యేసు – జన్మించినపుడు
అంధకారంపు – పృథివి వీధులలో
మోదంపు మహిమ – చోద్యంబుగనరే

1. ఉదయంపు తారల్ – ముదమున బాడె
ఉదయించ యేసు – ఈ పృథివిలోన
ముదమును గలిగె – మరి సమాధానం
పదిలంబుతోడ – పూజించ రండి
|| బేత్లెహేం ||

2. పరమును విడచి – నరరూపమెత్తి
అరుదెంచె యేసు – పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ – తొలగించివేసి
పరలోక శాంతి – స్థిరపరచె ప్రభువు
|| బేత్లెహేం ||

3. నీదు చిత్తమును – నాదు హృదయమున
ముదమున జేయ – మదినెంతో యాశ
నీదు పాలనము – పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగఁ జూడ
|| బేత్లెహేం ||

4. దేవుని సన్నిధి – దీనత నుండ
పావనయాత్మ – పవిత్ర పరచున్
పావను డేసు – ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి – జీవించు నెదలో
|| బేత్లెహేం ||

5. గతించె రాత్రి – ప్రకాశించె కాంతి
వితానముగ – వికసించె నెల్ల
దూతల ధ్వనితో – పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ – అరుదెంచు నోహో
|| బేత్లెహేం ||

Mariyaku sutuduga dharanu janminchi

Mariyaku sutuduga dharanu janminchi
immanuyelayen

‘a’ ‘p’ : Nirupedaganu pashuvula pakalo –
tejomaya prabhu bhuvini
sishuvuga buttenu “Mariyaku”

1. Papa sankatamu pogotta dharanu –
prapakudu naruniga bethlehemuna
papa pariharudu narula mithrudu –
avanilo janminchen “Mariyaku”

2. Akasha chukka bhasilluchunda –
veekatho deenopakarudu velasen
heena saitanudu koolipovagan –
priyamuto udayinchen “Mariyaku”

3. Doota ganamul geetamul paada –
kshitilo narulu mangalamupaada
kanya mariyamma padenu laali
punyudu janminchagaa “Mariyaku”

మరియకు సుతుడుగ ధరను జన్మించి
ఇమ్మానుయేలాయెన్ (2)

అనుపల్లవి : నిరుపేదగాను పశువుల పాకలో (2)
తేజోమయ ప్రభు భువుని (4)
శిశువుగ బుట్టెను

1. పాపసంకటము పోగొట్ట ధరను (2)
ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున (2)
పాపపరిహారుడు నరుల మిత్రుడు (2)
అవనిలో జన్మించెన్
|| దేవసుతుడు ||

2. ఆకాశచుక్క భాసిల్లుచుండ (2)
వీకతో దీనోపకారుడు వెలసెన్ (2)
హీన సైతానుడు కూలిపోవగన్ (2)
ప్రియముతో ఉదయించెన్
|| దేవసుతుడు ||

3. దూత గణములు గీతముల్ పాడ (2)
క్షితిలో నరులు మంగళము పాడ (2)
కన్య మరియమ్మ పాడెను లాలి (2)
పుణ్యుడు జన్మించగా
|| దేవసుతుడు ||