Naa Praanamaa Naa Samasthamaa

Neeti Vaagula Koraku Duppi Aashinchunatlu
Nee Koraku Naa Praanamu Dappigonuchunnadi

Naa Praanamaa Naa Samasthamaa
Prabhuni Sthuthiyinchumaa
Naa Yesu Chesina Mellanu Neevu Maruvakumaa – (2)        ||Naa Praanamaa||

Panikiraani Nanu Neevu Paiki Lepithivi
Kreesthane Bandapaina Nannu Nilipithivi (2)
Naa Adugulu Sthiraparachi Balamunichchithivi
Needu Adugu Jaadalane Vembadinthu Prabhu
Ne Vembadinthu Prabhu        ||Naa Praanamaa||

Andhakaarapu Loyalalo Nenu Nadachithini
Ye Apaayamu Raakundaa Nannu Nadipithivi (2)
Kantipaapaga Neevu Nannu Kaachithivi
Kanna Thandrivi Neevani Ninnu Kolichedanu
Ninnu Kolichedanu        ||Naa Praanamaa||

Needu Aathmatho Nindugaa Nannu Nimpu Prabhu
Aathma Phalamunu Dandigaa Neekai Phaliyinthunu (2)
Neevu Chesina Mellanu Nenetlu Marathu Prabhu
Nee Koraku Saakshigaa Ilalo Jeevinthunu
Ne Ilalo Jeevinthunu        ||Naa Praanamaa||

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది

నా ప్రాణమా నా సమస్తమా
ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2)      ||నా ప్రాణమా||

పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2)
నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు            ||నా ప్రాణమా||

అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
కంటిపాపగా నీవు నన్ను కాచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
నిన్ను కొలిచెదను            ||నా ప్రాణమా||

నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు
నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును            ||నా ప్రాణమా||

Vandanam Vandanam Pademu Parishuddha Gaanam

Vandanam Vandanam Pademu Parishuddha Gaanam
Srushtantha Nuv Palikina Kavitha
Keerthise Nee Madhura Naamam (2)
Etu Choosina Nee Naama Ghanatha
Pademu Parishuddha Gaanam..(2)

1.
Daaveedu Keerthanalalonu
Nee Premadegaa Prashamsa
Paraloka Doothalatho Kalisi
Sthuthi Gaanam Cheseti Aasha (2)
Ettayinaa Shikharalu Saitam
Elugetthi Ninu Keerthise (2)

2.
Aakaasha Tharalalonoo
Nee Unikini Chaate Sanketham
Paravallu Thokke Nadhee Jalam
Nee Prema Dhaara Sancharam (2)
Samdrana Kerataalu Saitam


వందనం వందనం పాడేము పరిశుద్ధ గానం
సృష్టంత నువ్ పలికిన కవిత కీర్తించే నీ మధుర నామం (2)
ఎటు చూసిన నీ నామ ఘనత పాడేము పరిశుద్ధ గానం..(2)

1.దావీదు కీర్తనలలోను నీ ప్రేమదేగా ప్రశంస
పరలోక దూతలతో కలిసి స్తుతి గానం చేసేటి ఆశ (2)
ఎత్తయినా శిఖరాలు సైతం ఎలుగెత్తి నిను కీర్తించే (2)

2.ఆకాశ తారలలోనూ నీ ఉనికిని చాటే సంకేతం
పరవళ్లు తొక్కే నదీ జలం నీ ప్రేమ ధారా సంచారం(2)
సంద్రాన కెరటాలు సైతం అరుదించే నీ ముఖ తేజం (2)