యెహోవా నా కాపరి – లేమి కలుగదు

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23

పల్లవి : యెహోవా నా కాపరి – లేమి కలుగదు
పచ్చికలపై పరుండజేయుచున్నాడు

1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల
చెంత నన్నడిపించుచున్నాడు
|| యెహోవా ||

2. సర్వదా నాదు ప్రాణంబునకు
సేద దీర్చుచున్నాడు యెహోవా
|| యెహోవా ||

3. తన నామమును బట్టి నీతి మార్గములో
నన్ను చక్కగా నడుపుచున్నాడు
|| యెహోవా ||

4. చీకటి లోయలో నే తిరిగినను
ఎట్టి అపాయమునకు భయపడను
|| యెహోవా ||

5. నీ దుడ్డుకర్ర నీ దండముతో న
న్నాదరించి తోడై యుందువు
|| యెహోవా ||

6.నా శత్రువుల యెదుట నీవు నాకు
భోజనము సిద్ధపరచుదువు
|| యెహోవా ||

7. నూనెతో నా తల నంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది
|| యెహోవా ||

8. నన్ను వెంటాడు సదా కృప క్షేమము
నిత్యమెహోవా మందిరములో నుండెద
|| యెహోవా ||

సిలువలో సాగింది యాత్ర

సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర ||2||

ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే ||సిలువలో||

పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో ||2||
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి ||2||
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి||

వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు ||2||
గేలి చేసినారు పరిహాసమాడినారు ||2||
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి||

సిలువలో ఆ సిలువలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2)

1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు

2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా

3. నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
నరులకై విలపించు నజరేయుడు
ఆ దేవుడు చిందించిన రుధిర దారలే
ఈ జగతిని విమోచించు జీవధారలు

1.నిరపరాధి మౌనభుని దీనుడాయెను
మాతృమూర్తి వేదననే ఓదార్చెను
అపవాది అహంకార మణచి వేసెను
పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ||

2.కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను
పాప జగతి పునాదులే కదలిపోయెను
లోక మంత చీకటి ఆవరించెను
శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||

సిలువ చెంత చేరిననాడు

పల్లవి:
సిలువ చెంత చేరిననాడు – కలుషములను కడిగివేయు

పౌలు వలెను సీల వలెను – సిద్ధపడిన భక్తుల జూచి
…సిలువ…

1.
కొండవంటి బండవంటి – మొండి హృదయంబు మండించు

పండియున్న పాపులనైన – పిలుచుచుండె పరము చేర
…సిలువ…

2.
వంద గొఱ్ఱెల మంద నుండి – ఒకటి తప్పి ఒంటరియాయె

తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి – ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్
…సిలువ…

3.
తప్పిపొయిన కుమారుండు – తండ్రిని విడచి తరలిపొయె

తప్పు తెలిసి తిరిగిరాగా – తండ్రి యతని చేర్చుకొనెను
…సిలువ…

4.
పాపి రావా పాపము విడచి – పరిశుద్ధు విందులొ చేర

పాపుల గతిని పరికించితివా – పాతాళంబే వారి యంతము
…సిలువ…