శిరము మీద ముళ్ల సాక్షిగా

శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ల సాక్షిగా
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా (2)
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు (3)
సర్వ పాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని (2)

మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
యేసులోనే నెరవేరెనుగా
సర్వ పాప పరిహారో
రక్త ప్రోక్షణం అవశ్యం
తద్ రక్తం పరమాత్మేనా
పుణ్య దాన బలియాగం
ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ ||శిరము||

మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని (2)
కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి
శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో
వృషభో రోర వీతి మహో దేవో
మద్యామ్ ఆవివేశత్తిథి
బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి
యేసులోనే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా ||శిరము||

యేసు చావొందె సిలువపై

పల్లవి: యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంతగొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే

1. నదివలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచె – ఆ ప్రశస్త రక్తమే

2. నేడే నీ పాపము లొప్పుకో – నీ పాపడాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో – క్రీస్తుయేసు రక్తములో

3. పాపశిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై – అంగీకరించు యేసుని

భాసిల్లెను సిలువలో పాపక్షమా

భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను||

1.కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||

2.పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను||

3.ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||

4.నమ్మిన వారిని కాదనవనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||

నీ రక్తమే – నీ రక్తమే

పల్లవి: నీ రక్తమే – నీ రక్తమే – నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే – నా బలము

1. నీ రక్తధారలే యిల – పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని – కడిగి పవిత్ర పరచును

2. నశించు వారికి నీ సిలువ – వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి – దేవుని శక్తియైయున్నద

3. నీ సిల్వలో కార్చినట్టి – విలువైన రక్తముచే
పాపమినుక్తి జేసితివి – పరిశుద్ధ దేవ తనయుడ

4. పదివలె పొర్లిన నన్ను – కుక్కవలె తిరిగిన నన్ను
ప్రేమతో ఝెర్చుకొంటివి – ప్రభువా నీ కే స్తోత్రము

5. నన్ను వెంబడించు సైతానున్ – నన్ను బెదరించు సైతానున్
దునుమాడేది నీ రక్తమే – దహించేది నీ రక్తమే

6. స్తుతి మహిమ ఘనతయు – యుగ యుగంబులకును
స్తుతి పాత్ర నీకే చెల్లును – స్తోత్రార్హుడ నీకే తగును

నా కోసమా ఈ సిలువ యాగము

నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2)
కల్వరిలో శ్రమలు నా కోసమా
కల్వరిలో సిలువ నా కోసమా (2) || నా కోసమా ||

నా చేతులు చేసిన పాపానికై
నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2)
నీ చేతులలో… నీ పాదాలలో…
నీ చేతులలో నీ పాదాలలో
మేకులు గుచ్చినారే (2)
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా ||

నా మనస్సులో చెడు తలంపులకై
నా హృదిలో చేసిన అవిధేయతకై (2)
నీ శిరస్సుపై… నీ శరీరముపై…
నీ శిరస్సుపై నీ శరీరముపై
ముళ్ళను గుచ్చినారే (2)
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా ||