కలువరి సిలువ సిలువలో విలువ

కలువరి సిలువ సిలువలో విలువ
నాకు తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి
నన్ను వెదికెనుగా (2)
అజేయుడా విజేయుడా
సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి||

కష్టాలలోన నష్టాలలోన
నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన
కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||

పాపానికైనా శాపానికైనా
రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా
మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||

ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి

ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి
దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ||యే పాప||

1. ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు
శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా ||యే పాప||

2. కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ
నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా ||యే పాప||

3. చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా
కడకుఁ కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా ||యే పాప||

4. ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు
సేతులు ఆ కొయ్యకే నూది మేకులతో గ్రుచ్చినారా ||యే పాప||

5. పలువిధంబుల శ్రమలు చెలరేగఁ దండ్రికి నెలుగెత్తి మొఱలిడితివా
సిలువపైఁ బలుమాఱు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా
||యే పాప||

6. బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్కఁ జిల్లిఁ బడఁ బొడిచి నాఁడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగఁ జల్లారెఁగద కోపము ||యే పాప||

7. కటకటా పాప సం కటముఁ బాపుట కింత పటుబాధ నొంది నావా
ఎటువంటి దీ ప్రేమ యెటువంటి దీ శాంతి మెటుల వర్ణింతు స్వామి
||యే పాప||

ఆహా మహాత్మ హా శరణ్యా

ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను
నా దోషమేగదా ||యాహా||

1. “వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్” కోరి తిటులు నిన్నుఁ
జంపు క్రూరజనులకై ||యాహా||

2. “నీవు నాతోఁ బరదైనున నేఁడె యుందువు” పావనుండ యిట్లుఁ బలికి
పాపిఁ గాచితి ||వాహా||

3. “అమ్మా! నీ నుతుఁడ” టంచు మరి యమ్మతోఁ బలికి క్రమ్మర “నీ
జనని” యంచుఁ గర్త నుడివితి ||వాహా||

4. “నా దేవ దేవ యేమి విడ నాడితి” వనుచు శ్రీదేవ సుత పలికితివి
శ్రమ చెప్పశక్యమా ||యాహా||

5. “దప్పికొనుచున్నా న” టంచుఁ జెప్పితివి గద యిప్పగిదిని బాధ నొంద
నేమి నీకు హా! ||యాహా||

6. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా “సమాప్తమైన” దంచుఁ
దెలిపి సమసితివి గదా ||యాహా||

7. “అప్పగింతుఁ దండ్రి నీకు నాత్మ” నంచును గొప్ప యార్భాటంబు చేసి
కూలిపోతివా ||యాహా||

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ

పల్లవి: ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ

1. పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె
…ఆశ్చర్యమైన ప్రేమ…

2. పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే
…ఆశ్చర్యమైన ప్రేమ…

3. శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు
…ఆశ్చర్యమైన ప్రేమ…

4. నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే
…ఆశ్చర్యమైన ప్రేమ…

అనాదిలో నియమించబడిన

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల

ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల

గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె

మౌని యాయెను బలియాగమాయెను

తన రుధిరముతో నన్ను కొనెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥

2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై

శరీరధారి యాయెను సజీవయాగమాయెను

మరణమును గెలిచి లేచెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥