సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2 యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే } 2 సిలువ సునాదమును నా శ్రమదినమున మధుర గీతికగా మదిలో వినిపించి } 2 సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో } 2|| యేసయ్యా || నాతోడు నీడవై మరపురాని మహోప కార్యములు నాకై చేసి } 2 చీకటి దాచిన -వేకువగా మార్చి బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే } 2|| యేసయ్యా || నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి } 2 మారా దాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై } 2
Telugu Christian Songs
యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి – నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా
నిను ఆరాధింప నా బలమా !
మది మందిరాన కొలువైన నా వరమా !!
1. నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
నీ ఆజ్ఞలను విడిచి – నన్ను తిరుగనియ్యకుము
దైర్యమునిచ్చే – నీ వాక్యములో
నీ బలము పొంది – దుష్టుని ఎదిరింతును !! యేసయ్య !!
2. నా గురి గమ్యమైన నిను చేరిటకు
ఈ లోక నటనలు చూచి – నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు -బహుమానమునకై
నా సిలువను మోయుచు – నిను వెంబడించెదను !! యేసయ్య !!
3. నీ సంపూర్ణ సమర్పణయే – లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే – ఇల ముక్తిప్రసన్నతలు
మహనీయమైన – నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును !! యేసయ్య !!
నాలోన అణువణువున నీవని
నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను
1. అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి
అమృతజల్లులు కురిపించే – అనందగానాలు పాడుచునే
కలిగియుందునే – నీ దైవత్వమే !! నాలోన !!
2. ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే
ఈ పరిచర్యలో నేను – వాగ్దానఫలములు పొందుకుని
ధరించుకుందునే – నీ దీనత్వమే !! నాలోన !!
3. వివేక హృదయము – అనుగ్రహించి
విజయపధములో నడిపించెదవు
వినయభయభక్తితో నేను – నిశ్చల రాజ్యము పొందుటకు
స్మరించుకుందునే – నీ ఆమరత్వమే !! నాలోన !!
ఆత్మపరిశుద్దాత్ముడా
ఆత్మపరిశుద్దాత్ముడా – నాలో నివసించుము
జీవింపజేసే సత్యస్వరూపుడా – నితో నడించుము
నా ప్రాణ ఆత్మ శరీరమును
యేసయ్య రాకకై సిద్దపరచుము
1. నిర్జీవమైన నా జీవితములో – నిరీక్షణ కలిగించితివి
లెక్కింపశక్యముగాని – సైన్యములో నను నిలిపితివి
నాలో నివసించుము – నీతో నడిపించుము
2. పెంతుకొస్తు దినమందున – బలముగ దిగివచ్చితివి
అన్యభాషలు మాట్లాదుతకు – వాక్ శక్తి నొసగితివి
నాలో నివసించుము – నీతో నడిపించుము
3. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు – నా యందు ఏర్పరుచుటకే
ఆరొగ్యకరమైన ఉపదేసములో – కృపతో స్దిరపరచితివి
నాలో నివసించుము – నీతో నడిపించుము
షారోను వనములో పూసిన పుష్పమై
షారోను వనములో పూసిన పుష్పమై
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని
1. సుకుమారమైన వదనము నీది – స్పటికము వలె చల్లనైన హృదయము నీది
మధురమైన నీ మాతల సవ్వడి వినగా – నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
ప్రభువా నిను చెరనా !!షారోను!!
2. సర్వొన్నతమైన రాజ్యము నీది – సొగసైన సంబరాల నగరము నీది
న్యాయమైన నీ పాలన విధులను చూడగా – నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా !!షారోను!!
3. సాత్వికమైన పరిచర్యలు నీవి – సూర్యకాంతిమయమైన వరములు నీవి
పరిమలించు పుష్పమునై చూపనా – ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా
ప్రభువా కృపతో నింపుమా !!షారోను!!