పాడనా మౌనముగానే స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)
యేసయ్యా నీతో సహజీవనము
నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే
నా ప్రాణాత్మ శరీరమును (2)
నా విమోచన గానము నీవే
నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే
నా వ్యామోహపు పొంగులన్నియు (2)
నా ఓదార్పు నిధివి నీవే
నా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా|| నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని
నీ తైలాభిషేకము నిండెనే
నా అంతరంగమంతయును (2)
నా మానస వీణవు నీవే
నా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||
Telugu Christian Songs
లెమ్ము తేజరిల్లుము
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2) శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి (2) ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత (2) జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసితివి (2) ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత…. ఇదియే నా ధన్యత ||లెమ్ము|| తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము (2) తేజోమయమైన షాలోము నగరులో నిను చూసి తరింతునే (2) ఇదియే దర్శనము… ఇదియే దర్శనము… ఇదియే నా దర్శనము ||లెమ్ము||
అదిగదిగో పరలోకము
మహాఘనుడవు మహోన్నతుడవు
మహాఘనుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)
కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా
నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)
వినయముగల వారిని
తగిన సమయములో హెచ్చించువాడవని (2)
నీవు వాడు పాత్రనై నేనుండుటకై
నిలిచియుందును పవిత్రతతో (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||
దీన మనస్సు గలవారికే
సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)
నీ సముఖములో సజీవ సాక్షినై
కాపాడుకొందును మెళకువతో (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||
శోధింపబడు వారికి
మార్గము చూపించి తప్పించువాడవని (2)
నా సిలువ మోయుచు నీ సిలువ నీడను
విశ్రమింతును అంతము వరకు (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||
వందనాలు వందనాలు
వందనాలు వందనాలు – వరాలు పంచే నీ గుణ సంపన్నతకు (2)
నీ త్యాగ శీలతకు నీ వశమైతి నే – అతి కాంక్షనీయుడా నా యేసయ్యా (2) ||వందన||
1. ఇహలోక ధననిధులన్నీ – శాశ్వతముకావని ఎరిగితిని (2)
ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే – ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి ||వందన||
2. యజమానుడా నీవైపు – దాసుడనై నా కన్నులెత్తగా (2)
యాజక వస్త్రములతో ననుఅలంకరించి – నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే (2) ||వందన||
3. ఆద్యంతములేని – అమరత్వమే నీ స్వంతము (2)
నీ వారసత్వపు హక్కులన్నియు – నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి (2) ||వందన||