యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి

“అతడు మందిరమునకును, బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి, ఆవరణ ద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని పూర్తిచేసెను.” నిర్గమ Exodus 40:33

పల్లవి : యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి
మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు

1. మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింప
చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో
త్రోసినను నడిపించెను వారిని విసుగక తనత్రోవ
|| యేసు ||

2. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపె
ఆవరణము నేర్పరచెను నిండుగ తెరవేసె
దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసె
|| యేసు ||

3. మందిరపని అంతయును సంపూర్ణము చేయగనే
సుందరముగ నొక మేఘము గుడారమును కమ్మె
మందిర మంతయు యెహోవా తేజస్సుతో నిండెన్
|| యేసు ||

4. నావన్నియును నీవెగదా అమరుడవగు దేవా
నీవన్నియు నాకిచ్చితివి నీకృపను బట్టి
మహిమ పరతును ఎల్లప్పుడు ఇహపరములయందు
|| యేసు ||

5. పరిశుద్ధ జనమా క్రీస్తు ప్రభుని బట్టి
పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో
నిరతము మహిమ స్తుతిఘనత చెల్లించెద మెపుడు
|| యేసు ||

ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్

“అప్పుడు మేఘము … మందిరమును నింపెను” నిర్గమ Exodus 40:34

పల్లవి : ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్

1. సార్వత్రిక సంఘ నగర విహారీ సర్వస్వానీ కాధారీ
పరిశుద్ధ మహాసభల ప్రధానీ భక్తస్తుతి హారాధారీ
|| ప్రభువైన ||

2. భక్తుండగు మోషే నీదు ఆనతిని నిర్మించె గుడారమున్
దానిన్ నీదు మహిమతో నింపి ధగధగ మెరిపించిన ప్రభో
|| ప్రభువైన ||

3. రూపాంతర మొంది రవికాంతిన్ మెరసి రమ్యంబుగా శిష్యుల
హృదయ సుమముల్ విరియబూయన్ సదయా ప్రకాశించితివి
|| ప్రభువైన ||

4. దీక్షన్ నీవే ప్రభూ తండ్రిచిత్తమున్ నెరవేర్చితివి పూర్తిగా
ధీరుడవై నీ ప్రాణం నొసగి తండ్రిని మహిమపరచితివి
|| ప్రభువైన ||

5. మంటి పురుగులమౌ మమ్ము రక్షించి మా నీతిమహిమ నీవై
మాలో నీవు మహిమరూప మహిమ పరచబడినావు
|| ప్రభువైన ||

6. మా స్తుతిసుగంధముల్ మా ప్రేమపూజల్ మాదు కృతజ్ఞతలు
మాప్రాణాత్మల్ మాదుతనువుల్ మాప్రభు నీస్వంతం నిరతం
|| ప్రభువైన ||