ఆకాంక్షతో నేను కనిపెట్టుదును

Akankshatho Nenu Kanipettudunu |ఆకాంక్షతో నేను కనిపెట్టుదును

ఆకాంక్షతో - నేను కనిపెట్టుదును
ప్రాణేశ్వరుడైన - యేసుని కొరకై

పావురము - పక్షులన్నియును 
దుఃఖారావం - అనుదినం చేయునట్లు 
దేహవిమోచనము కొరకై నేను 
మూల్గుచున్నాను సదా               || ఆకాంక్ష ||

గువ్వలు - గూళ్ళకు ఎగయునట్లు 
శుద్ధులు తమ - గృహమును చేరుచుండగా 
నా దివ్య గృహమైన - సీయోనులో 
చేరుట నా ఆశయే                      || ఆకాంక్ష ||

ఆదరణ కర్తవు

ఆదరణ కర్తవు అనాధునిగా
ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు

అల్పుడనైయున్న నన్ను చేర దీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బల పరిచెనే
ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై  “ఆదరణ”

నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు  “ఆదరణ”

యేసయ్య ! యేసయ్య !
యేసయ్య ! యేసయ్య !!

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే

పల్లవి: జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే-

నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే-

నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే-    (2X)…జ్యోతిర్మయుడా…

 

1.నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా    (2X)

నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా    (2X)

జ్యోతిర్మయుడా…

 

2.నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి    (2X)

నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా    (2X)

జ్యోతిర్మయుడా…

 

3.నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా    (2X)

త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద    (2X)

జ్యోతిర్మయుడా…

సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి

Suryuni Dharinchi | సూర్యుని ధరించి

సూర్యుని ధరించి 
చంద్రుని మీద నిలిచి 
ఆకాశములో కనుపించె ఈమె ఎవరు ? 

ఆత్మల భారం - ఆత్మాభిషేకం 
ఆత్మ వరములు - కలిగియున్న 
మహిమ గలిగిన - సంఘమే                         || సూర్యుని||

జయ జీవితము - ప్రసవించుటకై 
వేదన పడుచు - సాక్షియైయున్న 
కృపలో నిలిచిన - సంఘమే                         || సూర్యుని ||

ఆది అపోస్తలుల - ఉపదేశమునే 
మకుటముగా - ధరించియున్న 
క్రొత్త నిబంధన - సంఘమే                            || సూర్యుని ||

నా జీవితం – నీకంకితం

నా జీవితం – నీకంకితం

కడవరకు సాక్షిగా – నన్ను నిలుపుమా – ప్రభూ

1. బీడుబారినా – నా జీవితం

నీ సిలువ జీవ ఊటలు – నన్ను చిగురింపజేసెనే ॥ నా జేవితం ॥

2. పచ్చని ఒలీవనై – నీ మందిరావరణములో

నీ తోనే ఫలించెదా – బ్రతుకు దినములన్నిట ॥ నా జేవితం ॥