యెహోవా మహోన్నతుడా – మహిమయు నీదే

“సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక.” కీర్తన Psalm 150:6

పల్లవి : యెహోవా మహోన్నతుడా – మహిమయు నీదే
ఇహమందు రక్షకా – మహిమంచి దాతవు

1. పాలకుడవు పరమందు – ఏలికవు యెల్లరికి
చాలినట్టి ప్రధానుండా – సకల యధికారులకును
రాజుల రాజు ప్రభువుల ప్రభువు – ధరపర లోకములకు
దేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ
ǁ యెహోవా ||

2. పరమును విడచితివి – ధర కేతెంచితివి
ప్రాణమీవు బలిగానిచ్చి – మమ్మును రక్షించితివి
తిరిగి లేచి మాకు – కరుణ జీవమిచ్చితివి
విరివగు నీ ప్రేమ – నరులపై చూపితివి
ధర నీదే ఘనతయని – చరణముల పడుదుము
|| యెహోవా ||

3. సంఘమందు మహిమ నీకే – సకల యుగములకు
యుగమందు ప్రతిజీవి – యెహోవాయని యనున్
జగమంతటికి నీవు – నిజమైన ప్రభుడవు
ఆది యంతమై నీవు – అలరారుచున్నావు
యుగయుగములకు – ఘనమహిమ కలుగును
|| యెహోవా ||

సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మలో

“ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి …” హెబ్రీయులకు Hebrews 1:4

పల్లవి : సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ….ఆ….ఆ….

1. మోషే కంటె శ్రేష్ఠుడు – అన్ని – మోసములనుండి – విడిపించున్
వేషధారులను ద్వేషించున్ – ఆశతో – మ్రొక్కెదము
ǁ సాగిలపడి ||

2. అహరోను కంటె శ్రేష్ఠుడు – మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు – అందరము – మ్రొక్కెదము
|| సాగిలపడి ||

3. ఆలయముకన్న – శ్రేష్ఠుడు – నిజ ఆలయముగా తానే యుండెన్
ఆలయము మీరే యనెను – ఎల్లకాలము మ్రొక్కెదము
|| సాగిలపడి ||

4. యోనా కంటె శ్రేష్ఠుడు – ప్రాణ – దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్ -ఘనపరచి మ్రొక్కెదము
|| సాగిలపడి ||

5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు – సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు – పదిలముగా మ్రొక్కెదము
|| సాగిలపడి ||

6. రాజుల కంటె శ్రేష్ఠుడు – యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ – రయముగను మ్రొక్కెదము
|| సాగిలపడి ||

7. అందరిలో అతి శ్రేష్ఠుడు – మనకందరికీ తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు – అనుదినము మ్రొక్కెదము
|| సాగిలపడి ||