యెహోవా మందిరమునకు వెళ్లుదమని

“యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.” కీర్తన Psalm 122

1.యెహోవా మందిరమునకు వెళ్లుదమని
జనులు అనినప్పుడు సంతోషించితిని

పల్లవి : యెహోవా మందిరమునకు నడిచెదము

2. యెరూషలేము నగరు నీ గుమ్మములలో
మా పాదములు బాగుగా నిలుచుచున్నవి
|| యెహోవా ||

3. యెరూషలేమా బాగుగా కట్టబడిన
పట్టణమువలె కట్టబడియున్నావు
|| యెహోవా ||

4. అక్కడ ఇశ్రాయేలుకు సాక్షముగా
దేవుని జనము స్తుతించ వెళ్ళును
|| యెహోవా ||

5. జనముల యొక్క గోత్రములు
యెహోవా నామమును స్తుతింప వెళ్ళును
|| యెహోవా ||

6. అక్కడ దావీదు వంశీయుల యొక్క
నీతి సింహాసనము స్థాపించబడెను
|| యెహోవా ||

7. యెరూషలేము క్షేమము కొరకు
యెడతెగక ప్రార్థన చేయుడి
|| యెహోవా ||

8. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు
యెన్నడును వర్ధిల్లెదరు గాక
|| యెహోవా ||

9. నీ ప్రాకారములలో నెమ్మది
నీ నగరులలో క్షేమముండును గాక
|| యెహోవా ||

10. నా సహోదర సహవాసుల నిమిత్తము
క్షేమము కలుగునని నేనందును
|| యెహోవా ||

11. దేవుడైన యెహోవా మందిరమును బట్టి
నీకు మేలుచేయ ప్రయత్నించెదను
|| యెహోవా ||

కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను

“కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.” కీర్తన Psalm 121

పల్లవి : కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను
నాకు సాయమెచ్చట నుండి వచ్చును?

1. భూమి యాకాశముల సృజించిన
యెహోవా వలన సాయము కల్గున్
|| కొండలతట్టు ||

2. నీ పాదము తొట్రిల్ల నీయడు
నిన్ను కాపాడువాడు కునుకడు
|| కొండలతట్టు ||

3. ఇశ్రాయేలును కాచు దేవుడు
కునుకడు నిద్రపోడు ఎన్నడు
|| కొండలతట్టు ||

4. యెహోవాయే నిన్ను కాపాడును
కుడిప్రక్క నీడగా నుండును
|| కొండలతట్టు ||

5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ
నీకు తగులకుండ కాపాడును
|| కొండలతట్టు ||

5. ఎట్టి అపాయమైన రాకుండ
ఆయన నీ ప్రాణము కాపాడున్
|| కొండలతట్టు ||

5. ఇది మొదలుకొని నిత్యము నీ
రాకపోకలందు నిను కాపాడున్
|| కొండలతట్టు ||