అలరారు ఆ దివ్యరూపం – పశుశాలలో వెలిగే దీపం

అలరారు ఆ దివ్యరూపం – పశుశాలలో వెలిగే దీపం
పరిహరింపను మానవ పాపం
ప్రభవించెను ఇలలో ఆనందాం

1. ప్రకృతియే పరవశించి ఆడె – పరలోక సైన్యాలు పాడె
భక్తితో ఆ బాలుని వేడ – చూపించె ఒక తార జాడ

2. జగతిలోన మానవులను చూచె – బాలయేసు రూపము దాల్చె
గొల్లలే సేవింప రాగా – ప్రణమిల్లు ఈ దినమే వేగ

అరుణకాంతి కిరణమై-కరుణ చూపి ధరణిపై

అరుణకాంతి కిరణమై-కరుణ చూపి ధరణిపై
నరుని రూపు దాల్చెను-పరమదేవ తనయుడు
అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ (2) ఇదే ఇదే క్రిస్మస్ – మెరీ క్రిస్మస్

1. యజ్ఞ యాగాదులు-బలికర్మ కాండలు
దోషంబులు కడుగలేవు-దోషుల రక్షింపలేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే-పాపులకిల ముక్తి కలుగును
అందుకే అందుకే ..అరుణ

2. పుణ్యకార్యంబులు – మరి తీర్థయాత్రలు
మోక్షంబును చేర్చలేవు-మనశ్శాంతిని కూర్చలేవు
పరిశుద్ధుని రక్తమునందే-పాపులకిల ముక్తి కలుగును
అందుకే అందుకే ..అరుణ

అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో

అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో
నా జీవితం దాచినావు ‘2’
విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య
ఎడబాయదు నీ అనురాగము ‘2’

శాశ్వత జీవము నను చేర్చుటకు
ఉన్నత మహిమ విడచితివి ‘2’
నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు ‘2’
దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య
సాగిలపడి నిను సేవించెద ‘2’

నా శోధనలో కలవరపడుచు
వేదనతో నిండే నా హృదయం’2′
నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది ‘2’
ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య
నను విడిపించి దీవించువాడవు ‘2’

అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము

అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము
బేత్లెహేము ఊరిలోన యోసేపను మనుజుని యింట మరియకన్నియ ఉంది
దైవబలము కలిగిన యువతీ
ఆ కన్య గర్బములోన ఓ బాలుడు ఉదయించాడు
ఆ బాలుడు యేసైయంట వోరైయ్యా దేవా దూత సేలవిచెను వినవాయ్యా

1) తుర్పు ఎంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతుంది చూడు(2)
చీకటింకమాయం పాపమంత దూరం (2)
చిన్ని యేసు జగతికింక నేస్తం (అనగనగ)

2) శాంతి లేదు సుఖము లేదు మనసు చీకటయే బ్రతుకు భారమాయే(2)
శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం (2)
రక్షకుండు నేడు పుట్టినాడు(అనగనగ)

అదియందు వాక్యముండేను వాక్యమ దేవుని యెద్ద ఉండేను

అదియందు వాక్యముండేను వాక్యమ దేవుని యెద్ద ఉండేను (2)
ఆ…. వాక్యమే శరీర దారియై కృపాసత్య సంపూర్ణుడయేను (2)
Happy happy Christmas to you
Merry merry Christmas to you (2)
1. ఆయనలో జీవముండేను ఆ జీవమే మనకు వెలుగు (2)
ఆ వెలుగు నిజమైన వెలుగు అందరినీ వెలిగించుచున్నది (2)
Happy happy Christmas to you
Merry merry Christmas to you (2)
2. యేసు క్రీస్త నామమున విశ్వసముంచు వారికి (2)
దేవుని పిల్లలగుటకు అదికారం ఆనుగ్రహించేను (2)
Happy happy Christmas to you
Merry merry Christmas to you (2)