idi shubhodayam – kreesthu janmadinam

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం – (2)

రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ||ఇది||

గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||


idi shubhodayam – kreesthu janmadinam
idi loka kalyaanam
mary punyadinam – (2)

raajulanele raaraaju velase pashuvula paakalo
paapula paalita rakshakudu navvenu thalli kougililo
bhayamu ledu manakilalo
jayamu jayamu jayamaho ||idi||

gollalu gnaanulu aanaadu pranamilliri bhaya bhakthitho
pillalu peddalu eenaadu poojinchiri prema geethitho
jayanaadame ee bhuvilo
prathidhwaninchenu aa divilo ||idi||

ఇదే క్రిస్మస్ పండుగరోజు

ఇదే క్రిస్మస్ పండుగరోజు – నేడే శ్రీయేసుని పుట్టిన రోజు
క్రీస్తు ప్రభు నరరూపిగ – ధరకేతెంచిన రోజు ఈ రోజు
ఆహ ఆనందమే – ఆహ ఆశ్చర్యమే – రక్షకుని జననము
భయమేలనే భువియందున – జయరాజు జన్మంచెను (2) (ఇదే)

1) సర్వోన్నతుడు సర్వశక్తుడు
సర్వజనములకు రక్షణ దర్శనమిచ్చెను
పరమానందమే (ఇదే)

2) అన్యజనులకు ఆశ్రయదుర్గము
అంధకారముతో ఆశజ్యోతి (2)
వాత్సల్యముతో వెలుగుగా వచ్చెను
మహదానందమే (ఇదే)

3) ప్రియ కుమారుడు ఇమ్మానుయేలు
మార్గము సత్యము జీవమాయేసే(2)
అక్షయ మార్గము ఆనందింపవచ్చెను
నిత్యమానందమే (ఇదే)