వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్

వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

దివ్య తార దివ్య తార
దివి నుండి దిగి వఛ్చిన తార (2)
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2)
పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2) ||దివ్య||

జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2)
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2) ||దివ్య||

ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది (2)
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2) ||దివ్య||

పాపలోక జీవితం – పటాపంచలైనది (2)
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో వెలుగు తేజమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2) ||దివ్య||

మేరీ తెలుసా నీ కుమారుడు

మేరీ తెలుసా నీ కుమారుడు
నీటిపై నడచునని
మేరీ తెలుసా నీ కుమారుడు
నీ ప్రజలను రక్షించునని
నీకు తెలుసా నీ కుమారుడు
నిను నూతన పరచునని
జన్మనిచ్చిన నీ కుమారుడే
నీకు జన్మ నిచ్చునని……
మేరీ తెలుసా నీ కుమారుడు
గ్రుడ్డి వానికి చూపు నిచ్చునని
మేరీ తెలుసా నీ కుమారుడు
తన చేతితో తూఫాను ఆపునని
నీకు తెలుసా నీ కుమారుడు
దూతాలతో నడచునని
నీ బిడ్డను ముద్దడినచో
నీ దేవుని ముద్ధడేనని….
మేరీ తెలుసా………మేరీ తెలుసా……….
మేరీ తెలుసా……….. మేరీ తెలుసా……
గ్రుడ్డి వారు చూచున్ – చెవిటి వారు వినున్
మృతులే లేతురు……
కుంటి వారు నడచున్ – మూగ వారు పలుకున్
ఏసునకే స్తోత్రము
మేరీ తెలుసా నీ కుమారుడు
ఈ సృష్టికి ప్రభువని
మేరీ తెలుసా నీ కుమారుడు
ఈ జగతిని ఏలునని
నీకు తెలుసా నీ కుమారుడు
పరలోకపు ప్రియుడిని
నీ వడిలో ఉన్న కుమారుడే
అద్వితీయ దేవుడని……
మేరీ తెలుసా …….. మేరీ తెలుసా…….
మేరీ తెలుసా……….మేరీ తెలుసా………

బెత్లెహేములో సందడి

బెత్లెహేములో సందడి పశుపాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని మహరాజు పుట్టాడని 2

1 . ఆకాశములో సందడి చుక్కలో సందడి 2
మెగులతో సందడి మిలమిల మెరిసే సందడి 2 బెత్లె

2.దూత పాటతో సందడి సమాధాన వార్తతో సందడి 2
గ్లొలల పరుగులతో సందడి క్రిస్మస్‌ పాటలతో సందడి 2 బెత్లె

3. దావీదు పురములో సందడి రక్షకుని రాకతో సందడి 2
ఙానుల రాకతో సందడి లోకమంతా సందడి 2 బెత్లె

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్యా (2) ||బాలుడు||
కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరని సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||
చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||

దూత పాట పాడుఁడీ

1. దూత పాట పాడుఁడీ
రక్షకున్ స్తుతించుఁడీ
ఆ ప్రభుండు పుట్టెను
బెత్లెహేము నందునన్
భూజనంబు కెల్లను
సౌఖ్యసంభ్ర మాయెను
ఆకసంబునందున
మ్రోగు పాట చాటుఁడీ
దూత పాట పపాడుఁడీ
రక్షకున్ స్తుతించుఁడీ.

2. ఊర్ధ్వలోకమందునఁ
గొల్వఁగాను శుద్ధులు
అంత్యకాలమందున
కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా
ఓ యిమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుఁడా
నిన్ను నెన్న శక్యమా?
దూత పాట పాడుఁడీ
రక్షకున్ స్తుతించుఁడీ

3. దావె నీతి సూర్యుఁడా
రావె దేవపుత్రుఁడా
నీదు రాకవల్లను
లోక సౌఖ్య మాయెను
భూనివాసు లందఱు
మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి
ఆత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుఁడీ
రక్షకున్ స్తుతించుఁడీ