వింతైన తారక వెలిసింది గగనాన

వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

1.ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||

2.ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||

వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్

వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

దివ్య తార దివ్య తార
దివి నుండి దిగి వఛ్చిన తార (2)
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2)
పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2) ||దివ్య||

జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2)
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2) ||దివ్య||

ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది (2)
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2) ||దివ్య||

పాపలోక జీవితం – పటాపంచలైనది (2)
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో వెలుగు తేజమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2) ||దివ్య||