చుక్కను చూసి వచ్చినాము

చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము “2”
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము “2”

1) ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు
ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు “2”
చూసిన వారిని ఆశ్చర్యపరచి ” 2 “
కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా”2″
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము “2”

2) పసిబాలుడైన క్రీస్తేసు రాజు
పశువుల పాకలో పవళించినాడు ” 2′
చూసిన వారికి చూడముచ్చట గొలిపి”2″
చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా”2″
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము “2”
చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము “2”
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము “4”

చలి రాతిరి ఎదురు చూసే

చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చె
దూతలేమో పొగడ వచ్చె
పుట్టాడు పుట్టాడురో రారాజు
మెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2)
పశుల పాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు
నీవెట్టివాడవైనా నెట్టివేయడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||
చింతలెన్ని ఉన్నా చెంత చేరి
చేరదీయు వాడు ప్రేమగల్లవాడు
ఎవరు మరచినా నిన్ను మరవనన్న
మన దేవుడు గొప్ప గొప్పవాడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||