Stutulu nee karpintunu

Stutulu nee karpintunu – satatamu
maa prabhuvaa sannutinchedam

1. Gadachi natti kaalamu – karunatho nan gaanchitivi
vela lenatti nee krupa – choopinatti maa prabhu “Stutu”

2. Naadu dinamu lannitin – needu ksemamelunu
needu jaadalanniyun – saarambunitchunu “Stutu”

3. Needu mandirambulo – melu cheta mammunu
thruptiparachina prabhu – stutulu neeke chellunu“Stutu”

4. Needu naama ghanathanu – needu prema panulanu
naadhudaa ne paadeda – naadu priya prabhuvaa “Stutu”

5. Satyaroopi neevegaa – sakala srusti karthavu
satatamu mammelumu – Halleluya paadedam “Stutu”

స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువా
సన్నుతించెదం

1. గడచినట్టి కాలము – కరుణతో నన్ గాచితివి
వెల లేనట్టి నీ కృప – చూపినట్టి మా ప్రభు
|| స్తుతులు ||

2. నాదు దినము లన్నిటన్ – నీదు క్షేమ మేలును
నీదుజాడలన్నియున్ – సారంబు నిచ్చును
|| స్తుతులు ||

3. నీదు మందిరంబులో – మేలుచెత మమ్మును
తృప్తిపరచిన ప్రభు – స్తుతులు నీకే చెల్లును
|| స్తుతులు ||

4. నీదు నామ ఘనతను – నీదు ప్రేమ పనులను
నాథుడా నే పాడెద – నాదు ప్రియ ప్రభువా
|| స్తుతులు ||

5. సత్య రూపి నీవెగా – సకల సృష్టి కర్తవు
సతతము మమ్మేలుము – హల్లెలూయ పాడెదం
|| స్తుతులు ||

ఆనందముతో – ఆరాధింతున్

“ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెను” యోహాను John 4:24

పల్లవి : ఆనందముతో – ఆరాధింతున్ ఆత్మతోను – సత్యముతో
అనుపల్లవి : రక్షణ పాత్ర నేనెత్తుకొని – స్తుతులు నర్పింతును
హర్షించి పొగడి పూజింతును – యేసుని నామమును

1. పాపినైన నన్ను రక్షింపను – సిలువపై నాకై తానెక్కెను
పరిశుద్ధ జీవం నాకివ్వను – మృత్యుంజయుడై లేచెను
|| ఆనందముతో ||

2. మరణపుటురులలో నేనుండగా – నరరూపియై నా కడ కేతెంచెను
పరలోక జీవం నాకివ్వను – మరణపు ముల్లు విరచెను
|| ఆనందముతో ||

3. శత్రుని ఉరి నుండి విడిపింపను – శత్రువుతో నాకై పోరాడెను
పదిలంపు జీవం నాకివ్వను – క్రీస్తునందు నను దాచెను
|| ఆనందముతో ||

4. పరలోక పౌరసత్వం నా కివ్వను – పరమును వీడి ధరకేతెంచెను
సమృద్ధి జీవం నాకివ్వను – తన ప్రాణమర్పించెను
|| ఆనందముతో ||

5. శోధన వేదన బాధలెన్నో – ఈ లోక యాత్రలో ఎదురైనను
ప్రత్యేక జీవం జీవించను – అర్పించుకొందు నీకు
|| ఆనందముతో ||

6. అంగీకరించు – నా జీవితమును – నీ కొరకే ప్రభువా
హల్లెలూయ ఆమెన్ – హల్లెలూయ ఆమెన్ – హల్లెలూయ
|| ఆనందముతో ||

నే పాడెద నిత్యము పాడెద

“అతడు యధార్థ హృదయుడై … నేర్పరియై వారిని నడిపించెను” కీర్తన Psalm 78:72

పల్లవి : నే పాడెద నిత్యము పాడెద – ప్రభువా నీకు స్తుతి పాడెదన్

1. మంచి కాపరి నీవైతివి గొర్రెలకొరకు ప్రాణమిచ్చితివి
పాపపు పాత్రను నీవే త్రాగితివి రక్షణ పాత్రను నా కొసగితివి
హర్షించి ప్రభు పాడెదను
|| నే పాడెద ||

2. గొప్ప కాపరివి తోడై యున్నావు ప్రతి అవసరతల్ తీర్చుచున్నావు
నా ప్రాణమునకు సేదనుదీర్చి మరణలోయలలో తోడై యుందువు
యాత్రలో పాడుచు వెళ్ళెదను
|| నే పాడెద ||

3. ఆత్మల కాపరి సత్యవంతుడవు గొర్రెలన్నిటికి కాపరి నీవై
ద్వేషించెదవు దొంగకాపరులన్ నీగొర్రెలు నీస్వరమును వినును
హృదయపూర్తిగ పాడెదను
|| నే పాడెద ||

4. ప్రధానకాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు
మహిమకిరీటము నాకొసగెదవు పరమనగరమందు నన్నుంచెదవు
ఎలుగెత్తి ప్రభు పాడెదను
|| నే పాడెద ||

పూజనీయుడేసు ప్రభు

“ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు” 1 పేతురు Peter 2:23

పల్లవి : పూజనీయుడేసుప్రభు పలునిందల నొందితివా నాకై
పూజనీయుడేసు ప్రభు

1. నీ స్వకీయులే నిందించిన
నీన్నంగీకరించక పోయిన
ఎన్నో బాధ లొందితివా నాకై
సన్నుతింతును నీ ప్రేమకై
|| పూజనీయుడేసు ||

2. సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి
వంచకుడవ నిన్ను నిందించిర
ఓ దయామయ నజరేయుడ
|| పూజనీయుడేసు ||

3. యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా
అధములు నిన్ను సమరయు డనిర
నాథుడా నిన్ను బహు దూషించిరా
|| పూజనీయుడేసు ||

4. దూషించు శత్రుసమూహములన్
దీవించి ఎంతో క్షమించితివి
దూషకుడవని నిన్ను దూషించిర
దోషరహితుడా నా యేసు ప్రభు
|| పూజనీయుడేసు ||

5. దయ్యములు నినుజూచి వణికినను
దయ్యముల పారద్రోలినను
దయ్యములు పట్టిన వాడనిర
ఓ దయామయ నా యేసు ప్రభు
|| పూజనీయుడేసు ||

6. మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నా రాధింతును
వధియించబడితివ యీ పాపికై
వందితా ప్రభు నిన్ను పూజింతును
|| పూజనీయుడేసు ||

పొందితిని నేను ప్రభువా నీ నుండి

“చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము” 2 కొరింథీ Corinthians 9:15

పల్లవి : పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు

1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని – ఇంతవరకు నాకుతోడై యుండి
ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా – నా రక్షణ కర్తవు నీవైతివి
|| పొందితిని ||

2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని – అంధకారశక్తుల ప్రభావమునుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా – నీవే ఆశ్రయ దుర్గం బైతివి
|| పొందితిని ||

3. కష్టదుఃఖంబులు నాకు కలుగగా – నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశలయందున ప్రభువా – బహుగా దైర్యంబు నా కొసగితివి
|| పొందితిని ||

4. నా దేహమందున ముల్లు నుంచితివి – సాతానుని దూతగా నలుగగొట్టన్
వ్యాధి బాధలు బలహీనతలందు – నీ కృపను నాకు దయచేసితివి
|| పొందితిని ||

5. నీ ప్రేమచేత ధన్యుడనైతిని – కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కష్టపరీక్షల యందున ప్రభువా – జయజీవితము నాకు నేర్పించితివి
|| పొందితిని ||