నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే

నా గీతారాధనలో యేసయ్యా - నీ కృప ఆధారమే 
నా ఆవేదనలలో -  జనించెనే నీ కృపాదరణ 

నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే 
చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే 
నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే          || నా గీతా || 

చేనిలోని పైరు చేతికిరాకున్నా - ఫలములన్ని రాలిపోయినా 
సిరిసంపదలన్నీ దూరమైపోయినా - నేను చలించనులే 
నిశ్చలమైన రాజ్యముకొరకే - ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే       || నా గీతా || 

ఆత్మాభిషేకం - నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే 
ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే 
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు - నే వేచియుందునే నీ రాకడకై || నా గీతా ||

నేను యేసును చూచే సమయం

నేను యేసును చూచే సమయం – బహు సమీపమాయనే
శుభప్రదమైన యీ నిరీక్షణతో – శృతి చేయబడెనే నా జీవితం 

అక్షయ శరీరముతో - ఆకాశ గగనమున 
ఆనందభరితనై - ప్రియయేసు సరసనే పరవసించెదను || నేను ||

రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును 
గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును      || నేను || 

అక్షయ కిరీటముతో అలంకరించబడి 
నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను  || నేను ||