ఆనందమే ప్రభు యేసును

Anandhame Prabhu Yesunu (ఆనందమే ప్రభు యేసును) ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడెద. సిలువలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై నన్నును పిలిచెను సింహపుకోరల నుండి నన్ను విడిపించెను విశ్వాసమును కాపాడుకొనుచూ విజయుడైన యేసుని ముఖమును చూచుచూ విలువైన కిరీటము పొందెద నిశ్చయము నా మానస వీణను మ్రోగించగా నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు

దేవా, నా దేవుడవు నీవే

దేవా, నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును|2| నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను ||దేవా, నా దేవుడవు నీవే|| నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం |2| నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరము |2| ||దేవా, నా దేవుడవు నీవే|| ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం నీ రెక్కలు చాటున శరణన్నది నా ప్రాణం |2| ||దేవా, నా దేవుడవు నీవే||