వందనము నీకే నా వందనము

వందనము నీకే నా వందనము (2)వర్ణనకందని నీకే నా వందనము (2)      ||వందనము|| నీ ప్రేమ నేనేల మరతునీ ప్రేమ వర్ణింతునా (2)దాని లోతు ఎత్తునే గ్రహించి (2)నీ ప్రాణ త్యాగమునే తలంచి (2)      ||వందనము|| సర్వ కృపానిధి నీవేసర్వాధిపతియును నీవే (2)సంఘానికి శిరస్సు నీవే (2)నా సంగీత సాహిత్యము నీవే (2)      ||వందనము|| పరిశుద్ధమైన నీ నామంపరిమళ తైలము వలె (2)పరము నుండి పోయబడి (2)పరవశించి నేను పాడెదను (2)      ||వందనము|| మృతి వచ్చెనే ఒకని నుండికృప వచ్చెనే నీలో … Read more

సర్వోన్నతుడా – హోసన్నా మినిస్ట్రీస్

సర్వోన్నతుడానీవే నాకు ఆశ్రయదుర్గము (2)ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2)ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2) నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుటనిలువలేరని యెహోషువాతో (2)వాగ్దానము చేసినావువాగ్దాన భూమిలో చేర్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥ నిందలపాలై నిత్య నిబంధననీతో చేసిన దానియేలుకు (2)సింహాసనమిచ్చినావుసింహాల నోళ్లను మూసినావు (2)      ॥సర్వోన్నతుడా॥ నీతి కిరీటం దర్శనముగాదర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)విశ్వాసము కాచినావుజయజీవితము ఇచ్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥