నా హృదయాన కొలువైన యేసయ్యా

నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా (2)        ||నా హృదయాన||

అగ్ని ఏడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2)
అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2)
నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2)        ||నా హృదయాన||

అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2)
నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2)
నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2)        ||నా హృదయాన||

విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2)
సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2)
నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును (2)        ||నా హృదయాన||

నిరంతరం నీతోనే జీవించాలనే

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా     ||నిరంతరం||

చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి (2)
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

నమ్మి నమ్మి… మనుషులను

నమ్మి నమ్మి… మనుషులను నీవు నమ్మీ నమ్మీ… పలుమార్లు మోసపోయావు – పలుమార్లు మోసపోయావు

ఇలా ఎంత కాలమూ – నీవు సాగిపోదువు

 

1.రాజులను నమ్మి… బహుమతిని ప్రేమించిన – బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను

నా యేసయ్యను నమ్మిన యెడలా – ఉన్నత బహుమానమూ – నీకు నిశ్చయమే

నమ్మి నమ్మి… మనుషులను నీవు నమ్మీ నమ్మీ… పలుమార్లు మోసపోయావు – పలుమార్లు మోసపోయావు

ఇలా ఎంత కాలమూ – నీవు సాగిపోదువు

 

2.ఐశ్వర్యము నమ్మి…వెండీ బంగారము ఆశించిన – ఆకాను ఏమాయెను- అగ్నికి ఆహుతి ఆయెను

నా యేసయ్యను నమ్మిన యెడలా – మహిమైశ్వర్యము – నీకు నిశ్చయమే

నమ్మి నమ్మి… మనుషులను నీవు నమ్మీ నమ్మీ… పలుమార్లు మోసపోయావు – పలుమార్లు మోసపోయావు

ఇలా ఎంత కాలమూ – నీవు సాగిపోదువు

 

3.సుఖభోగము నమ్మి… ధనాపేక్షతో పరుగెత్తిన – గెహజి ఏమాయెను – అగ్నికి ఆహుతి ఆయెను

నా యేసయ్యను నమ్మిన యెడలా – శాశ్వతమైన ఘనత – నీకు నిశ్చయమే

నమ్మి నమ్మి… మనుషులను నీవు నమ్మీ నమ్మీ… పలుమార్లు మోసపోయావు – పలుమార్లు మోసపోయావు

ఇలా ఎంత కాలమూ – నీవు సాగిపోదువు

నేనెందుకని నీ సొత్తుగా మారితిని

నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ

నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును            “నేనె”

నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే
నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును              “నేనె”

నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును               ” నేనె”

వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్ర

వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి     ||వీనులకు||

రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||

 

రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||


సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||