పాడనా మౌనముగానే స్తుతి కీర్తన

పాడనా మౌనముగానే స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)
యేసయ్యా నీతో సహజీవనము
నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2)         ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే
నా ప్రాణాత్మ శరీరమును (2)
నా విమోచన గానము నీవే
నా రక్షణ శృంగము నీవే (2)         ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే
నా వ్యామోహపు పొంగులన్నియు (2)
నా ఓదార్పు నిధివి నీవే
నా ఆనంద క్షేత్రము నీవే (2)         ||పాడనా|| నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని
నీ తైలాభిషేకము నిండెనే
నా అంతరంగమంతయును (2)
నా మానస వీణవు నీవే
నా ఆరాధన పల్లకి నీవే (2)         ||పాడనా||

నీ కృప నిత్యముండును

నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప||

శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)        ||నీ కృప||

ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)        ||నీ కృప||

అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)        ||నీ కృప||

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”