యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే

“జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.” యోహాను John 6:35

పల్లవి : యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే
నా ప్రతి యాశను తీర్చుకొందును

1. నీవే నాకు జీవాహారము
నిన్ను సమీపించు వారే మాత్రము
ఆకలి గొనరిల ఆదర్శుడవు
|| యేసు ||

2. నీ మందిర సమృద్ధి వలన
నా మది నెప్పుడు తృప్తి పొందితిని
ఆనంద జలమును త్రాగించుచున్నావు
|| యేసు ||

3. నీవే నాకు జీవపు మార్గము
నీ సన్నిధిని పూర్ణానందము
కలదని నిన్ను ఘనపరచెదను
|| యేసు ||

4. ఆశతో నిండిన నా ప్రాణమును
ఆకలి గొనిన నాదు ఆత్మను
మేలుతో నీవు తృప్తిపరచితివి
|| యేసు ||

5. నీ సంతోషము నాకొసగితివి
నా సంతోషము పరిపూర్ణముగా
కావలయునని కోరిన ప్రభువా
|| యేసు ||

6. నా జీవిత కాలమంతయును
నీ ఆలయములో నివసించుచు
హల్లెలూయ పాటను పాడెద ప్రభువా
|| యేసు ||

ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు

“రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను.” కీర్తన Psalm 145:1

1. ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు
దీని ప్రియాత్మ! కోరుదు రేని స్మరింపు
కూడుడిదో! కిన్నెర వీణలతో గానము చేయనులెండి

2. సర్వము వింతగ పాలన చేసెడువాడు
రెక్కలతో నిను మోసెను గావున బాడు
నీకు సదా కావలి యుండుగదా – దాని గ్రహింపవదేల

3. ఆత్మను! మిక్కిలి వింతగా నిన్ను సృజించి
సౌఖ్యము నిచ్చుచు స్నేహముతో నడిపించి
కష్టములో కప్పుచు రెక్కలతో గాచిన నాథునుతింపు

4. స్నేహపు వర్షము – నీపై తా గురియించి
అందరు చూచుచు ఉండగనే కరుణించి
దీవెనలు నీకు నిరంతరము నిచ్చిన నాథునుతించు

5. నాథుని నామము – నాత్మ స్మరించి నుతింపు
ఊపిర గల్గిన స్వరమా నీవు నుతింపు
సంఘములో నాబ్రాహాం సంతతితో – నాథునుతింపుము