స్తుతి సింహసనసినుడవు

స్తుతి సింహసనసినుడవు

స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
దయారసా యేసురాజా – దయారసా యేసురాజా
నీదు రూపును వర్ణించలేనయ్యా – నీదు రూపును వర్ణించలేనయ్యా – 2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా -2
నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో -2
నీ తోడు నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా  – 4

పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి -2
నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ -2
నీ సిలువ నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా  – 4

కృపయే నేటి వరకు

Krupaye Neti Varaku – కృపయే నేటి వరకు

కృపయే నేటి వరకు కాచెను

నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹

1. మనోనేత్రములు వెలిగించినందున

యేసు పిలిచిన పిలుపును

క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో

పరిశుద్ధులలో చూపితివే  ౹౹కృపా ౹౹

2. జలములలో బడి వెళ్ళునపుడు

అలలవలె అవి పొంగి రాగా

అలల వలే నీ కృపతోడై

చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹

3. భీకర రూపము దాల్చిన లోకము

మ్రింగుటకు నన్ను సమీపించగా

ఆశ్చర్యకరములు ఆదుకొని

అందని కృపలో దాచెనుగా ౹౹కృపా౹౹

4. సేవార్థమైన వీణెలతో నేను

వీణెలు వాయించు వైణికులున్నా

సీయోను కొరకే జీవించుచూ

సీయోను రాజుతో హర్షించేదను ౹౹కృపా౹౹

5. నీదు వాక్యము – నా పాదములకు

నిత్యమైన వెలుగై యుండున్

నా కాలుజారె ననుకొనగా

నిలిపెను నన్ను నీ కృపయే ౹౹కృపా౹౹

ప్రేమమయా – యేసు ప్రభువా

Premamaya Yesu Prabhuva | ప్రేమమయా – యేసు ప్రభువా

పల్లవి || ప్రేమమయా - యేసు ప్రభువా 
నిన్నే స్తుతింతును - ప్రభువా 
అనుదినమూ - అనుక్షణము నిన్నే స్తుతింతును - ప్రభువా || ప్రేమ || 

చ || ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు 
ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై || ప్రేమ || 

చ || ఎదవాకిటను - నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు 
ప్రభువా హృదయాంగనములోకి అరుదెంచినావు నాకెంతో ఆనందమే || ప్రేమ || 

చ || శోధనలు నను చుట్టుకొనినా ఆవేదనలు నను అలముకొనినా 
శోధన రోదన ఆవేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమ ||

నిత్యుడా – నీ సన్నిధి

నిత్యుడా – నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా -2

నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా – తలక్రిందనున్నది -2
నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా -2                  ॥ నిత్యుడా ॥

నీ సన్నిధిలో – నా హృదయమును
నీళ్ళవలే – కుమ్మరించునట్లు -2
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2              ॥ నిత్యుడా ॥

నీ సముఖములో – కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు – నన్ను తలంచితివా -2
నీ చిత్తమే నాలో – నేరవేర్చుమా -2                       ॥ నిత్యుడా ॥

నీటివాగుల కొరకు

Neeti vaagula Koraku | నీటివాగుల కొరకు

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు  నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది 
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా 
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా 

పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి 
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి 
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి 
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు || నా ప్రాణ || 

అంధకారపు లోయలలో నేను నడచితిని 
ఏ అపాయము రాకుండా నన్ను కాచితివి 
కన్నతండ్రివి నీవని నిన్ను కొలిచెదను ఇలలో నిన్ను కొలిచెదను || నా ప్రాణ || 

నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు 
ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలియింతును 
నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు 
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును || నా ప్రాణ ||