నా ప్రార్థనలన్ని ఆలకించినావు

నా ప్రార్థనలన్ని ఆలకించినావు

నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము

నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను

నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు ||2|| || నా ప్రార్థనలన్ని ||

1. అడిగినంతకంటె అధికముగా చేయు

ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా ||2||

పరిపూర్ణమైన నీ దైవత్వమంతా

పరిశుద్ధతకే శుభ ఆనవాలు ||2|| || నా ప్రార్థనలన్ని ||

2. ఆపత్కాలములో మొరపెట్టగానే

సమీపమైతివే నా యేసయ్యా ||2||

సమీప భాందవ్యములన్నిటికన్నా

మిన్నయైనది నీ స్నేహబంధము ||2|| || నా ప్రార్థనలన్ని ||

3. ఎక్కలేనంత ఎత్తైన కొండపై

ఎక్కించుము నన్ను నా యేసయ్యా ||2||

ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు

ఆత్మీయతకే స్థిరపునాదులు ||2|| || నా ప్రార్థనలన్ని ||

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద ||2||

నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని ||2||

1. ఆధారణలేని  లోకములో
ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే ||2||
అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో
అరణ్యవాసమే  మేలాయెనే ||2||  || నా అర్పణలు ||

2. గమ్యమెరుగని వ్యామోహాలలో
గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే ||2||
గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో
షాలేము నీడయే నాకు మేలాయెనే ||2||  || నా అర్పణలు ||

3. మందకాపరుల గుడారాలలో
మైమరచితినే మమతను చూపిన నీపైనే ||2||
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
సీయోనుధ్యానమే నాకు మేలాయెను ||2||  || నా అర్పణలు ||