ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.” యోహాను John 3:16

పల్లవి : ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి
తన కుమారుని పంపెను రక్తము చిందించి
మా పాపము కడుగ సిలువపై అర్పించెను

1. త్యాగసహిత ప్రేమజూపి నెరవేర్చె తన నిబంధనను
మనలను తానే నిర్మించె గనుక మనలను ప్రేమించెను
|| ప్రేమ ||

2. శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై ఋజువు గావించెను
తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల జేసెనుగా
|| ప్రేమ ||

3. తండ్రివలెనే ప్రేమజూపి నీచులనెల్ల ప్రేమించెను
ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును
|| ప్రేమ ||

4. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా
తన మహా ప్రేమ జూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను
|| ప్రేమ ||

5. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతము
హల్లెలూయ స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే
|| ప్రేమ ||

రక్షకుని విచిత్ర ప్రేమన్ – పాడుచుందు నెప్పుడున్

“సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును” హెబ్రీ Hebrews 2:12

రక్షకుని విచిత్ర ప్రేమన్ – పాడుచుందు నెప్పుడున్
క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్

పల్లవి : పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్
సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను

1. తెల్పుదున్ విచిత్ర కథన్ – పాడైన నా స్థితిని
కాచి కృపా ప్రేమతోడ – నన్ను విమోచించెను
|| పాడుడి ||

2. ప్రియ రక్షకును పాడి – జయశక్తి తెల్పుదున్
పాపమృతి పాతాళము – పై విజయమిచ్చెను
|| పాడుడి ||

3. నా రక్షకుని పరమ పాడి – ప్రేమగూర్చి పాడుదున్
చావు నుండి జీవమునకు – తెచ్చె దైవసుతుడు
|| పాడుడి ||