ఆశీర్వాదంబుల్ మా మీద

ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దత్తము

ఇమ్మాహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా

ఓ దేవా పంపింపవయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్      || ఇమ్మాహి ||

మా మీద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద
క్షామంబు పోనట్లుగన్        || ఇమ్మాహి ||

ఈనాడే వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి
సన్నుతి బ్రౌర్ధింతుము     || ఇమ్మాహి ||

నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును

నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును   (2)
శోధించబడిన మీదట
నేను సువర్ణమై మారెదను   (2)   ||నేను ..||

1. కడలేని కడలి తీరము
ఎడమాయె కడకు నా బ్రతుకున   (2)
గురిలేని తరుణాన వెరువగ
నా దరినే నిలిచేవ నా ప్రభు   (2)
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్‌   (2)     ||నేను ..||

2. జలములలోబడి నే వెళ్లినా
అవి నా మీద పారవు   (2)
అగ్నిలో నేను నడచినా
జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్‌   (2)   ||నేను ..||

3. విశ్వాస నావ సాగుచు
పయనించు సమయాన నా ప్రభు  (2)
సాతాను సుడిగాలి రేపగా
నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్‌   (2)   ||నేను ..||

 


 

Nenu Velle Maargamu
Naa Yesuke Teliyunu (2)
Shodhinchabadina Meedata
Nenu Suvarnamai Maredanu (2)   || Nenu ||

1.
Kadaleni Kadaliteeramu
Edamaaye Kadaku Naa Brathukuna (2)
Gurileni Tarunana Veruvaga
Naa Darine Nilicheva Naa Prabhu (2)
Hallelujah Hallelujah
Hallelujah Amen (2)   || Nenu ||

2.
Jalamulalobadi Ne Vellina
Avi Naa Meeda Paravu (2)
Agnilo Nenu Nadachina
Jwaalalu Nanu Kaalchajalavu (2)
Hallelujah Hallelujah
Hallelujah Amen (2)    || Nenu ||

3.
Vishwas Naava Saaguchu
Payaninchu Samayana Naa Prabhu (2)
Saatanu Sudigaali Repaga
Naa Yedute Nilicheva Naa Prabhu (2)
Hallelujah Hallelujah
Hallelujah Amen (2)   || Nenu ||