అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని? నాకు సహాయము చేయుటకై – నీ దక్షిణ హస్తము చాపితివే సత్య సాక్షిగా నేనుండుటకై – ఉపకరములెన్నో చేసితివే హల్లెలూయ – ఉపకరములెన్నో చేసితివే నాకు దీర్గాయువునిచ్చుటకే – నీ హితోపదేశము పంపితివే నిత్యజీవము నే పొందుటకు – పునరుత్థానము నొందితివే హల్లెలూయ – పునరుత్థానము నొందితివే నాకు ఐశ్వర్యము నిచ్చుటకే – నీ … Read more

శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము

శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2|| యేసయ్యా నీ నామ స్మరణయే నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| ||శాశ్వత|| 1.సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు ||2|| నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2|| నా నోట మృదువైన మాటలు పలికించినావు ||శాశ్వత|| 2.నా విలాప రాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2|| శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు||శాశ్వత||