సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే

“నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.” కీర్తన Psalm 84:1-7

సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే
సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే

పల్లవి : తన రెక్కల క్రింద ఆశ్రయము – తన రెక్కలతో కప్పును

1. ఆయనే నా ఆశ్రయము – నా కోటయు దుర్గమును
ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు
|| తన రెక్కల ||

2. పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనా
చీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను
|| తన రెక్కల ||

3. వేయి పదివేలు కుడిప్రక్కను కూలినను
దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు
|| తన రెక్కల ||

4. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం
అపాయము తెగులు – నీ గుడారము సమీపించవు
|| తన రెక్కల ||

5. నీదు మార్గంబులలో – నిన్ను దూతలు కాయున్
పాదములకు రాయి తగులకుండ నిన్నెత్తికొందురు
|| తన రెక్కల ||

6. కొదమ సింహముల నాగుపాముల నణచెదవు
అతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను
|| తన రెక్కల ||

7. అతడు నను ప్రేమించెన్ – నామమున మొఱ్ఱపెట్టెన్
అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్
|| తన రెక్కల ||

వేల్పులలో బహుఘనుడా

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా
నిను సేవించువారిని ఘనపరతువు (2)
నిను ప్రేమించువారికి సమస్తము
సమకూర్చి జరిగింతువు. . . .
నీయందు భయభక్తి గల వారికీ
శాశ్వత కృపనిచ్చేదవు. . . .|| వేల్పులలో ||

సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2)
మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2)|| వేల్పులలో ||

ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో
ఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు (2)
విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతో
నిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో (2)|| వేల్పులలో ||

పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతో
అజ్ఞానము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు (2)
పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకు
చెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను (2)